తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్‌ కుమార్‌ గౌడ్‌ నియామకం.. ప్రకటించిన ఏఐసీసీ

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా నియామక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. గడిచిన నాలుగు నెలలు నుంచి టీపీసీసీ అధ్యక్షుడిగా నియామక ప్రక్రియ జరుగుతోంది. పలువురి పేర్లను పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఎట్టకేలకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్‌ నేత మహేష్‌ కుమార్‌ గౌడ్‌ను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ శుక్రవారం ప్రకటన చేసింది. పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ పీసీసీ అధ్యక్షుడి నియామకానికి సంబంధించిన ప్రకటనను విడుదల చేశారు.

Mahesh Kumar Goud

మహేష్‌ కుమార్‌ గౌడ్‌

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా నియామక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. గడిచిన నాలుగు నెలలు నుంచి టీపీసీసీ అధ్యక్షుడిగా నియామక ప్రక్రియ జరుగుతోంది. పలువురి పేర్లను పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఎట్టకేలకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్‌ నేత మహేష్‌ కుమార్‌ గౌడ్‌ను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ శుక్రవారం ప్రకటన చేసింది. పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ పీసీసీ అధ్యక్షుడి నియామకానికి సంబంధించిన ప్రకటనను విడుదల చేశారు. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఇన్నాళ్లు టీపీసీసీ అధ్యక్షుడిగా అద్భుతంగా పని చేసిన సీఎం రేవంత్‌రెడ్డిని అభినందిస్తున్నట్టు ఆ ప్రకటనలో కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది.

కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతగా మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, ఎమ్మెల్సీగా కూడా మహేష్‌ కుమార్‌ గౌడ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఆయన పనితీరు పట్ల పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. సీఎం రేవంత్‌ రెడ్డి కూడా ముందు నుంచీ ఆయన పట్ల సానుకూలంగా ఉంటూ వచ్చారు. నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ రేవంత్‌ రెడ్డితోపాటు ఇతర సీనియర్‌ నేతల సూచనలతో మహేష్‌కుమార్‌ గౌడ్‌ను పార్టీ అధిష్టానం ప్రెసిడెంట్‌గా ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. తెలంగాణకు నాలుగో పీసీసీ అధ్యక్షుడిగా మహేష్‌కుమార్‌ గౌడ్‌ నిలిచారు. కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘకాలం పని చేసిన అనుభవం ఆయన సొంతం. ఎన్‌ఎస్‌యూఐ నుంచి ఆయన పార్టీలో కీలక స్థానానికి ఎదిగారు. ఉమ్మడి ఏపీలో 2013, 2014లో వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గానూ సేవలు అందించారు. 2014లో నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కరాటే అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా కూడా ఆయన ఉన్నారు. మహేష్‌కుమార్‌ గౌడ్‌కు పలువురు పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన సారథ్యంలో పార్టీ బలోపేతం అవుతుందన్న నమ్మకాన్ని పలువురు పార్టీ నాయకులు వ్యక్తం చేశారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్