ఏపీలో సార్వత్రిక ఎన్నికల అనంతరం పెద్ద ఎత్తున అధికార వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోనూ ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల అనంతరం పెద్ద ఎత్తున అధికార వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోనూ ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇరువర్గాల కర్రలు, రాడ్లతో దాడులకు తెగబడ్డాయి. చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నానిపై అధికార పార్టీకి చెందిన పలువురు హత్యాయత్నాకి ప్రయత్నించారు. ఈ ఘటనలో నానితోపాటు ఆయన గన్‌మెన్ తీవ్రంగా గాయపడ్డారు. రాడ్లు, కర్రలతో ఆయనపై హత్యాయత్నాకి పాల్పడ్డారంటూ ఫిర్యాదులు అందాయి. దీనిపై పోలీసులు విచారణను జోరుగా సాగించారు. ఈ కేసులు ప్రధాన నిందితులు భానుకుమార్ రెడ్డి, గణపతిరెడ్డితోపాటు మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 13 మందికి తిరుపతి ఏడీజే కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. నిందితులను చిత్తూరు సబ్ జైలుకు పోలీసులు తరలించారు.
పోలింగ్ మరుసటి రోజు ఘటన
చిత్తూరు జిల్లాలో పోలింగ్ అనంతరం చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పులవర్తి నాని వర్గీయులకు ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఎన్నికలు తరువాతి రోజు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని స్ర్టాంగ్ రూమ్‌ను పరిశీలించేందుకు పులివర్తి నాని వెళ్లారు. ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు మారణాయుధాలతో ఆయనపై దాడికి తెబడినట్టు చెబుతున్నారు. ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్న నాని.. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన సమయంలో నానిని సురక్షితంగా తప్పించే క్రమంలో ఆయన సెక్యూరిటీ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. కంటి దగ్గరలో పెద్ద ఎత్తున గాయం ఏర్పడింది. నాని భద్రతా సిబ్బందికి చెందిన కారు పూర్తిగా ధ్వంసమైంది. నాని భార్య, టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకుని కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఇదిలా ఉంటే తనపై జరిగిన దాడి వెనుక కుట్రలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉన్నారంటూ నాని ఆరోపించడం గమనార్హం.