ఏపీ ఉచిత విద్యుత్‌పై మంత్రి గొట్టిపాటి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత విద్యుత్‌పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ప్రకటన చేశారు. వ్యవసాయానికి నిరంతరంగా ఉచిత విద్యుత్తు అందించాలని, సరఫరా కోసం పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

gottipati ravi kumar

మంత్రి గొట్టిపాటి రవికుమార్

అమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత విద్యుత్‌పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ప్రకటన చేశారు. వ్యవసాయానికి నిరంతరంగా ఉచిత విద్యుత్తు అందించాలని, సరఫరా కోసం పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని డిస్కంలకు సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో వర్షాల వల్ల దెబ్బతిన్న విద్యుత్ స్థంబాలు, లూజుగా ఉన్నలైన్లు, ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ల విషయంలో రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దానికోసం ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటుచేసి, విద్యాసంస్థలను డిస్కంలకు అందుబాటులో ఉండేలా అనుసంధానం చేయనున్నారు. అయితే, బిల్లు రీడింగ్ కొట్టినా, ఇన్‌చార్జి అధికారికి బిల్లు జారీ చేయాలని, ఆ బిల్లులకు డబ్బు చెల్లించేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. దానివల్ల విద్యుత్ దుర్వినియోగానికి ఆస్కారం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్