ఏపీకి పొంచివున్న వాయుగుండం ముప్పు.. ఈ నెల 26న వర్షాలు

దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆదివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు రోజుల్లో అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.

raining

కురుస్తున్న వర్షం

దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆదివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు రోజుల్లో అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఈ ఉపరితల ఆవర్తనం తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఈ నెల 27 నాటికి తమిళనాడు లేదా ఏపీలో తీరం దాటుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. దీని ప్రభావంతో వచ్చే మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి వాతావరణం పెరిగింది. సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలో నమోదవుతుండడంతో చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో, శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఉదయం 8 గంటల వరకు మంచు కురుస్తూ ఉండడంతో అనేక ప్రాంతాల్లో వాహన రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరగడంతో పాటు మంచు అధికంగా కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్