ఏపీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు మంత్రులు, అధికారులతో కూడిన బృందం జ్యురిచ్‌లోని తెలుగు పారిశ్రామికవేత్తలతో సోమవారం సాయంత్రం భేటీ అయింది. ఈ సందర్భంగా జాబ్స్ ఫర్ తెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఏపీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీలోనూ, యూరప్‌లోనూ ఉద్యోగ, ఉపాధి, పెట్బుడి అవకావాలపై వారికి ప్రజెంటేషన్ ఇచ్చారు.
పారిశ్రామికవేత్తలతో సమావేశమైన సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు మంత్రులు, అధికారులతో కూడిన బృందం జ్యురిచ్‌లోని తెలుగు పారిశ్రామికవేత్తలతో సోమవారం సాయంత్రం భేటీ అయింది. ఈ సందర్భంగా జాబ్స్ ఫర్ తెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఏపీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీలోనూ, యూరప్‌లోనూ ఉద్యోగ, ఉపాధి, పెట్బుడి అవకావాలపై వారికి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు పశ్చిమాసియా, అమెరికా దేశాలకు పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు తరలివెళ్లారని, ఇప్పుడుయూరప్‌లోనూ విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. వర్కర్లకు ఇమిగ్రేషన్ పాలసీలు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. యూరప్‌లో క్రిప్టో కరెన్సీ తరహా ఆర్థిక వ్యవస్థను స్టార్టప్‌గా పెట్టామని తెలుగు పారిశ్రామికవేత్తలు ఆయనకు వివరించారు. ఏపీని క్రిప్టోజోన్, క్రిప్టో ఇన్నేవేషన్ హబ్‌గా తీర్చిదిద్దే అవకాశం ఉందని వెల్లడించారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సానుకూల వాతావరణం ఉందని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ వివరించారు.
రాష్ట్రంలో మానుఫ్యాక్చరింగ్, ఆర్‌అండ్‌డీ, మెకానికల్, ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్, ప్రెసిషన్ ఇన్‌స్ర్టుమెంట్స్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు నేృతృత్వంలో ప్రగతిశీల ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ప్రెంఢ్లీ విధానాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పారిశ్రామిక ప్రోత్సహకాలు అందిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేసే సంస్థలకు 15 రోజుల్లో అన్ని అనుమతులు మంజూరు చేసేందుకు ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేసిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి అనుసరిస్తున్న విధానాలు, తీసుకోబోతున్న నిర్ణయాలు వంటి వాటికి గురించి పారిశ్రామికవేత్తలకు వివరించారు. ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారాన్ని అందిస్తామని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలంటూ సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ వారికి భరోసాను కల్పించారు. అన్ని అనుమతులు అత్యంత వేగంగా అందించేందుకు కృషి చేస్తామన్నారు. దీనిపై ఇప్పటికే రోడ్ మ్యాప్ సిద్ధం చేసిన విషయాన్ని పారిశ్రామికవేత్తలు దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం జ్యూరిచ్ విమానాశ్రయంలో కలుసుకున్నారు. వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. పెట్టుబడులు రాబట్టేందుకు ఇరు రాష్ట్రాలు మధ్య స్నేహపూర్వక పోటీ ఉండాలని ఈ సందర్భంగా ఇద్దరూ వ్యాఖ్యానించారు.