తెలంగాణ బాటలో ఏపీ.. ఉన్నత విద్యా సంస్థల్లో సీట్ల కేటాయింపుపై కీలక నిర్ణయం

ఉన్నత విద్యా సంస్థల్లోని సీట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ బాటలో నడవాలని నిర్ణయించింది. ఇకపై మా సీట్లు మాకే అంటూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా స్థానికత, నాన్ లోకల్ కోటాల స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ కూడా అదే విధానంలో వెళ్లేందుకు సిద్ధమైంది. దీంతో ఇక నుంచి రాష్ట్రంలోని ఉన్నత విద్యలో సీట్లు రాష్ట్ర విద్యార్థులకే దక్కునున్నాయి. దీనిపై ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్నత విద్యలో అన్ రిజర్వుడ్ కోటా అమలవుతుంది. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రాన్ని మూడు రీజియన్లుగా విభజించి ఈ కోటా అమలు చేశారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఉన్నత విద్యా సంస్థల్లోని సీట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ బాటలో నడవాలని నిర్ణయించింది. ఇకపై మా సీట్లు మాకే అంటూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా స్థానికత, నాన్ లోకల్ కోటాల స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ కూడా అదే విధానంలో వెళ్లేందుకు సిద్ధమైంది. దీంతో ఇక నుంచి రాష్ట్రంలోని ఉన్నత విద్యలో సీట్లు రాష్ట్ర విద్యార్థులకే దక్కునున్నాయి. దీనిపై ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్నత విద్యలో అన్ రిజర్వుడ్ కోటా అమలవుతుంది. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రాన్ని మూడు రీజియన్లుగా విభజించి ఈ కోటా అమలు చేశారు. ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ), రాయలసీమలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (యస్వి), తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ ఓయూలో ఈ కోటాకు ప్రాతిపదికగా ఉన్నాయి. ప్రతి యూనివర్సిటీలో కన్వీనర్ కోటా సీట్లో 85 శాతం పూర్తిగా ఆ యూనివర్సిటీ పరిధిలోకి వస్తాయి. మిగిలిన 15 శాతం సీట్లను అన్ రిజర్వుడ్ గా పేర్కొని ఆయా వర్సిటీలు పరిధిలోని విద్యార్థులకు కేటాయిస్తారు. రాష్ట్ర విభజన పూర్తయి పదేళ్లు దాటిన నేపథ్యంలో ఈ కోటా వర్తించదంటూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా మార్పులు చేసింది.

అన్ రిజర్వుడ్ కోటాలో ఏయు, ఎస్వియును తొలగించింది. దీంతో ఏపీ విద్యార్థులు ఓయూ పరిధి అయిన తెలంగాణలో సీట్లు పొందడానికి అర్హత కోల్పోయారు. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఏయు, ఎస్వీయు అన్ రిజర్వుడ్ కోటాలో ఓయును తొలగించనుంది. దీంతో రాష్ట్రానికి చెందిన సీట్లు, రాష్ట్రంలోని వేరువేరు ప్రాంతాల విద్యార్థులకు మాత్రమే దక్కుతాయి. ఇతర రాష్ట్రాల విద్యార్థులకు సీట్లు ఎలా కేటాయించాలని దానిపై ఇంకా కసరత్తు జరుగుతుంది. స్థానికతపైన ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఉన్నత విద్యలో సీట్లకు పునర్విభజన చట్టానికి సంబంధం లేదని వాదన తాజాగా వినిపిస్తోంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉన్నత విద్యలో అన్ రిజర్వడ్ కోటా అమలవుతుందని, ఈ కోట తొలగించాలంటే రాజ్యాంగంలోని 371(డి) తొలగించడం లేదా సవరించడం ద్వారా సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.  కోటాపై తెలంగాణ నిర్ణయం తీసుకోవడంతో ఏపీ విద్యార్థుల ప్రయోజనాలు దృష్ట్యా సర్కార్ కూడా అదే బాటను ఎంచుకుంది. ఈ నిర్ణయం వల్ల ఇరు రాష్ట్రాల్లోని విద్యార్థులకు మేలు చేకూరుతుంది. ఇప్పటి వరకు ఆయా యూనివర్సిటీల్లోని సీట్లను 15 శాతం చొప్పున ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తూ వచ్చారు.. ఇకపై స్థానిక విద్యార్థులకు కేటాయించనున్న నేపథ్యంలో స్థానిక విద్యార్థులకు మేలు చేకూరనుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్