ఏపీలో ప్రజలకు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను అందించేందుకు గత జగన్మోహన్ రెడ్డి సర్కారు వాలంటీర్లను ఏర్పాటు చేసింది. సుమారు 2.60 లక్షల మంది వాలంటీర్లను అప్పటి జగన్ ప్రభుత్వం నియమించింది. వీరిలో కొందరు సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు ప్రచారం నిర్వహించేందుకు రాజీనామాలు చేశారు. మిగిలిన వాళ్ళు ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఎన్నికల సమయంలో 1,09,192 మంది వాలంటీర్లు రాజీనామా చేయిగా, ఇంకా 1,53,908 మంది పని చేస్తున్నారు.
వాలంటీర్లు
ఏపీలో ప్రజలకు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను అందించేందుకు గత జగన్మోహన్ రెడ్డి సర్కారు వాలంటీర్లను ఏర్పాటు చేసింది. సుమారు 2.60 లక్షల మంది వాలంటీర్లను అప్పటి జగన్ ప్రభుత్వం నియమించింది. వీరిలో కొందరు సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు ప్రచారం నిర్వహించేందుకు రాజీనామాలు చేశారు. మిగిలిన వాళ్ళు ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఎన్నికల సమయంలో 1,09,192 మంది వాలంటీర్లు రాజీనామా చేయిగా, ఇంకా 1,53,908 మంది పని చేస్తున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న వారిపై ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అదే సమయంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కీలక హామీ ఇచ్చారు. అదే వాలంటీర్లకు రూ.10,000 వేతనం చెల్లింపు. ప్రస్తుతం ఉన్న వారిని కొనసాగించి వీరికే రూ.10,000 చొప్పున వేతనాన్ని చెల్లిస్తారా..? లేక.? వీరిని తొలగించి కొత్తవారిని నియమించి వారికి రూ.10,000 చొప్పున వేతనాన్ని అందిస్తారా..? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ అంశాలపైన ప్రభుత్వం తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది.
ప్రస్తుతం ఉన్న వాలంటీర్లంతా గత వైసిపికి చెందిన వాళ్లే కావడంతో వీరిని కొనసాగించే అవకాశాలు లేవని చెబుతున్నారు. ఒక్కో గ్రామానికి అవసరానికి మించి వాలంటీర్లు ఉండడాన్ని ఈ ప్రభుత్వం గుర్తించింది. ఈ సంఖ్యను కొంతవరకు తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో వీరిని సచివాలయ సిబ్బంది ద్వారా మరిన్ని సేవలు అందించేలా చేయనున్నారు. మండల కేంద్రాలకు కూడా వీరిని అటాచ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రతిరోజు వీరు సమయ పాలన ప్రకారం పనిచేసేలా నిబంధనలు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి తరహాలో వీరికి జాబ్ చార్ట్, సమయపాలన వంటివి నిర్ణయించి ఆ తర్వాత కొత్తవారిని నియమించడం, పాతవారిని కొనసాగించడం, తొలగించడం వంటి చేయవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చి రెండో నెల కావ వచ్చింది. ఈ రెండు నెలల కాలంలో వాలంటీర్లు పని చేయనప్పటికీ జీతాలు చెల్లించారు. ఇది అదనంగా ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని మోపుతున్నట్టు అవుతోంది. ఈ నేపథ్యంలోనే వీరిపై కొద్దిరోజుల్లోనే కేలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూటమి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే తమను కొనసాగించాలన్న డిమాండ్ తో రాష్ట్రంలో ప్రస్తుతం పని చేస్తున్న వాలంటీర్లు చలో విజయవాడకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే వీరిపై ప్రభుత్వం మరింత వేగంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.