ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. డ్వాక్రా ఉత్పత్తుల విక్రయానికి ఫ్లిప్కార్ట్ తో ఒప్పందం

డ్వాక్రా సంఘాల్లో ఉంటూ వివిధ వస్తువులను తయారు చేసే మహిళలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అతివల అభ్యున్నతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు వారిని ఆర్థికంగా బలపాతం చేసేది కొన్ని కార్యక్రమాలను అమలు చేసింది సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్న ఏపీ ప్రభుత్వం.. జిల్లాలో వివిధ సంక్షేమ పథకాలు కింద మహిళా లబ్ధిదారుల సంఖ్యల పెంచేందుకు నిరంతరం కలెక్టర్లను అప్రమత్తం చూస్తోంది. గడచిన 8 నెలల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 10,64, 277 మంది మహిళలకు పెన్షన్లు, డ్వాక్రా, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటివి అందించారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

డ్వాక్రా సంఘాల్లో ఉంటూ వివిధ వస్తువులను తయారు చేసే మహిళలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అతివల అభ్యున్నతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు వారిని ఆర్థికంగా బలపాతం చేసేది కొన్ని కార్యక్రమాలను అమలు చేసింది సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్న ఏపీ ప్రభుత్వం.. జిల్లాలో వివిధ సంక్షేమ పథకాలు కింద మహిళా లబ్ధిదారుల సంఖ్యల పెంచేందుకు నిరంతరం కలెక్టర్లను అప్రమత్తం చూస్తోంది. గడచిన 8 నెలల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 10,64, 277 మంది మహిళలకు పెన్షన్లు, డ్వాక్రా, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటివి అందించారు. ఈ క్రమంలోనే మహిళలను మరింత ఆర్థికంగా అభివృద్ధి తీసుకువచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంలో భాగంగా డ్వాక్రా సంఘాల ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రముఖ ఆన్లైన్ వ్యాపార సంస్థ ఫ్లిప్కార్ట్ తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వ్యవసాయం, వ్యవసాయతర ఉత్పత్తులపై దివాకర మహిళలకు వ్యాపార శిక్షణ అందించడం కోసం క్యాటలిస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ తో సెర్ప్ ఒప్పందం కుదుర్చుకుంది.

చిన్న తరహా హోటల్ వ్యాపారంలో డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పించడానికి గాటోస్ కెఫేతో కూడా ఒప్పందం చేసుకోవాలని సెర్ప్ భావిస్తుంది. వివిధ సేవా రంగాల్లోకి మహిళల భాగస్వామ్యాన్ని విస్తరించి వారి ఆదాయ మార్గాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తుంది. ఎలక్ట్రీషియన్, ప్లంబర్లు, కార్పెంటర్లు, బ్యూటీషియన్లు, గృహోపకరణ మరమ్మతుల విభాగంలో వారికి శిక్షణ ఇప్పించేందుకు హోం ట్రయాంగిల్ కంపెనీతో మెప్మా ఒప్పందం చేసుకుంది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 18,515 మంది మహిళలకు జీవనోపాధి అవకాశాలు లభిస్తాయి. డ్రైవింగ్ నైపుణ్యమున్నవారిని ప్రోత్సహించేందుకు రాపిడో సర్వీసెస్ తో ఒప్పందం చేసుకుంది. నైపుణ్యం, ఆసక్తి ఉన్న వెయ్యి మంది మహిళలకు ప్రభుత్వమే ఈ బైకులు, ఈ ఆటోలు అందించనుంది. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ద్వారా వెయ్యి మంది మహిళలకు రక్ష చొప్పున రుణాలు ఇవ్వనుంది. మహిళా సంఘాల ద్వారా అరకు కాఫీ ప్రమోషన్ కు 100 అవుట్లెట్లు, 100 కాఫీ హోటలను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. వీటిలో పెద్ద ఎత్తున మహిళలకు అవకాశం కల్పించడం ద్వారా వారంతా ఆర్థికంగా పురోగతి సాధించేందుకు అవకాశాన్ని ప్రభుత్వం కల్పించేందుకు సిద్ధపడుతోంది. డ్వాక్రా సంఘాల్లోని మహిళల ఆర్థిక అభ్యున్నతికి అవకాశాలను కల్పించడం ద్వారా వారు మరింత ఉన్నతికి ఎదిగేందుకు అవకాశాలను కల్పించవచ్చన్న భావనలో ప్రభుత్వం ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్