నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. భారీగా టీచర్‌ పోస్టుల భర్తీ

ఏపీలోని నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో భారీగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి మే 15వ తేదీ వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. గడిచిన కొన్నేళ్లుగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువత టీచర్‌ పోస్టుల భర్తీ కోసం ఆశగా ఎదురు చేస్తున్నారు. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో నిరుద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్‌ 20 నుంచి మే 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నోటిఫికేషన్‌ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు మంత్రి నారా లోకేష్‌ సూచించారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలోని నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో భారీగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి మే 15వ తేదీ వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. గడిచిన కొన్నేళ్లుగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువత టీచర్‌ పోస్టుల భర్తీ కోసం ఆశగా ఎదురు చేస్తున్నారు. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో నిరుద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్‌ 20 నుంచి మే 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నోటిఫికేషన్‌ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు మంత్రి నారా లోకేష్‌ సూచించారు. డీఎస్సీకి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మే 15 వరకు గడువు ఇచ్చారు. మే 20 నుంచి మాక్‌ టెస్టులు నిర్వహించనున్నారు. మే 30న డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జూన్‌ ఆరో తేదీ నుంచి జూలై ఆరో తేదీ వరకు డీఎస్సీ పరీక్షలను నిర్వహించనున్నారు.

అన్ని పరీక్షలు పూర్తయిన రెండు రోజుల తరువాత ప్రాథమిక కీ విడుదల కానుంది. అనంతరం ఏడు రోజులపాటు అభ్యర్థులు నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన వారం రోజులకు డీఎస్సీ పరీక్ష ఫైనల్‌ కీ విడుదల చేయనున్నారు. మరో వారం రోజలకు డీఎస్సీ మెరిట్‌ జాబితా విడుదల అవుతుంది. డీఎస్సీలో భాగంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర, జోనల్‌ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి. జిల్లా, మండల పరిషత్‌లు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, పురపాలక, జువైనల్‌ సంక్షేమ పాఠశాలల్లోని పోస్టులకు జిల్లా స్థాయిలో నియామక ప్రక్రియ ఉంటుంది. ఏపీ రెసిడెన్సియల్‌, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలలతోపాటు బధిర, అంధుల స్కూల్స్‌లోని పోస్టులను రాష్ట్ర, జోనల్‌ స్థాయిలో భర్తీ చేయనున్నారు. ఎస్‌జీటీ పోస్టులు 6,599 ఉండగా, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 7,487, వ్యాయామ ఉపాధ్యాయులు పోస్టులు కలిపి 14,088 పోస్టులు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి పోస్టులు 259 ఉన్నాయి. జోన్‌-1లో 400 పోస్టులు, జోన్‌-2లో 348 పోస్టలు, జోన్‌-3లో 570 పోస్టులు, జోన్‌-4లో అత్యధికంగా 682 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ జిల్లా, మండల పరిషత్‌, పురపాల స్కూల్స్‌లో మొత్తం 13,192 పోస్టులు ఉన్నాయి. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 881 పోస్టులు, జువైనల్‌ పాఠశాలల్లో 15 ఖాళీలను రాష్ట్ర స్థాయిలో భర్తీ చేయనున్నారు. అంధుల పాఠశాలల్లో 31 పోస్టులు ఉన్నాయని నోటిఫికేషన్‌ పేర్కొన్నారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్