ఏపీలోని కీలక నేతలకు వరుస రెండు రోజుల్లో సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సోమవారం ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఊరట కల్పించేలా సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయడంతో పాటు కేసులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని కోరుతూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. సోమవారం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకోగా.. మంగళవారం అదే సుప్రీంకోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అనుకూలంగా ఒక నిర్ణయం వెలువడింది.
ప్రతీకాత్మక చిత్రం
ఏపీలోని కీలక నేతలకు వరుస రెండు రోజుల్లో సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సోమవారం ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఊరట కల్పించేలా సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయడంతో పాటు కేసులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని కోరుతూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. సోమవారం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకోగా.. మంగళవారం అదే సుప్రీంకోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అనుకూలంగా ఒక నిర్ణయం వెలువడింది. చంద్రబాబుపై నమోదైన కేసులను సిబిఐకి బదిలీ చేయాలని కోరుతూ హైకోర్టు లాయర్ బి బాలయ్య దాకులు చేసిన పిటిషన్ ను జస్టిస్ బేలా త్రివేది మంగళవారం విచారణ చేపట్టారు. విచారణ అనంతరం సిబిఐకి కేసుల బదలాయింపు పిటిషన్ ను డిస్మిస్ చేశారు. ఇది సరైన పిటిషన్ కాదని, దీనిపై ఒక్క మాట ఏమైనా మాట్లాడిన జరిమానా విధిస్తామని జస్టిస్ త్రివేది విచారణ అనంతరం స్పష్టం చేశారు. దీంతో వరుస రెండు రోజుల వ్యవధిలోనే ఏపీలోని ముఖ్య నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించినట్టు అయింది.
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేసులు విషయానికి వస్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై ఏడు సిఐడి కేసులు నమోదయ్యాయి. పిటిషనర్ బాలయ్య తరఫున వాదనలు వినిపించడానికి సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ ఓకే చేయడంపై జడ్జ్ అసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి కేసులను సీనియర్ లాయర్ అయిన మీలాంటి వ్యక్తి వాదించడానికి హాజరవుతారని తాము అస్సలు ఊహించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. వైసిపి హయాంలో చంద్రబాబుపై పలు కేసులు నమోదు కాగా.. అప్పటికప్పుడు నోటీసులు ఇచ్చి అరెస్టు చేయడం అప్పట్లోనే సంచలనం అయింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు ఏడు వారాలపాటు జైల్లో కూడా ఉన్నారు. అనంతరం ఆయన బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. జైలు నుంచి బెయిల్ పై విడుదలైన చంద్రబాబు ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, v ఎన్నికలు పూర్తి కావడం, ఎన్నికల్లో కూటమి పార్టీ విజయం సాధించి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి.