నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. పది రోజులపాటు నిర్వహణ, వైసిపి గైర్హాజరు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పది రోజులు పాటు ఈ సమావేశాలను నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేశారు. మొదటి రోజున ప్రభుత్వం సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ వాయిదా పడుతుంది. అనంతరం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

AP Assembly

ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పది రోజులు పాటు ఈ సమావేశాలను నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేశారు. మొదటి రోజున ప్రభుత్వం సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ వాయిదా పడుతుంది. అనంతరం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ ఏ అంశాలపై చర్చించాలనే విషయాలను చర్చిస్తారు. ఈ నెల 22 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. బీఏసీలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈసారి అసెంబ్లీలో ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా రెచ్చిపోతున్న వినియోగదాలకు అడ్డుకట్ట వేసేలా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలనే ప్రభుత్వం భావిస్తోంది. సోషల్ సైకోలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూ ఆక్రమణలపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు.

అదే సమయంలో భూ ఆక్రమణల నిరోధానికి సంబంధించిన ప్రత్యేక చట్టాన్ని ఈ సమావేశంలో ప్రవేశపెడతారని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలను వైసిపి బాయ్ కాట్ చేయనుంది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, జనసేన, ఓటమికి 164 స్థానాలు రాగా, వైసీపీకి 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వైసిపి తమకు శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ వస్తోంది. కోర్టును కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆశ్రయించారు. అయితే విపక్ష నేత హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించడం లేదు. శాసనసభలో మిగిలిన వారంతా అధికార పక్షమే ఉన్నారని, వైసిపి మాత్రమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని, కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ జగన్మోహన్ రెడ్డి కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించింది. ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లిన తమను పట్టించుకోరని, మాట్లాడేందుకు మైక్ కూడా ఇవ్వరని.. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడం కంటే వెళ్లకపోవడమే ఉత్తమమని భావించిన వైసిపి ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు చప్పగా సాగే అవకాశం ఉందని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్