నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. సభకు హాజరు కానున్న జగన్

ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 20 రోజులపాటు బడ్జెట్ సెషన్ నిర్వహించాలని స్పీకర్ నిర్ణయించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సభ సోమవారం లాంఛనంగా ప్రారంభం అవుతుంది. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. అనంతరం మరుసటి రోజుకు సభ వాయిదా పడుతుంది. సభ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులపాటు సమావేశాలు నిర్వహించాలనే దానిపై, సభలో ప్రతిరోజు ఏఏ అంశాలు చర్చించాలనే ఏజెండాను ఖరారు చేస్తారు. మూడు వారాలపాటు సభను నిర్వహిస్తారని చెబుతున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకోనన్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 20 రోజులపాటు బడ్జెట్ సెషన్ నిర్వహించాలని స్పీకర్ నిర్ణయించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సభ సోమవారం లాంఛనంగా ప్రారంభం అవుతుంది. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. అనంతరం మరుసటి రోజుకు సభ వాయిదా పడుతుంది. సభ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులపాటు సమావేశాలు నిర్వహించాలనే దానిపై, సభలో ప్రతిరోజు ఏఏ అంశాలు చర్చించాలనే ఏజెండాను ఖరారు చేస్తారు. మూడు వారాలపాటు సభను నిర్వహిస్తారని చెబుతున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకోనన్నారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉందని.. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై గొంతు విప్పేది కాబట్టి హోదా ఇవ్వాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయనున్నారు. ప్రతిపక్ష హోదా కోరుతూ ఇప్పటికే హైకోర్టులో వైసిపి పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటివరకు తన అభిప్రాయాన్ని హైకోర్టు కోరినప్పటికీ స్పీకర్ చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం అవమానిస్తాందని ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రాంగణంలో నిబంధనలను కొట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. పాసులు ఉన్న వారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. మండలి చైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కి మాత్రమే అసెంబ్లీ గేట్-1 నుంచి అనుమతి ఉంటుంది. గేట్ -2 నుంచి మంత్రులకు మాత్రమే అనుమతి ఇవ్వనన్నారు. గేట్-4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అనుమతిస్తూ బులిటన్ జారీ చేశారు. మరోవైపు శాసనసభ పరిసరాల్లో సమావేశాలు, ప్రదర్శనలు, ధర్నాలు, బైఠాయింపులను పూర్తిగా నిషేధించారు. జగన్మోహన్ రెడ్డి సభకు వస్తున్న నేపథ్యంలోనే ఇటువంటి నిబంధనలను అమలు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాల్లో కూటమి పార్టీలు వైసిపి పట్ల ఎలా వ్యవహరిస్తాయి అన్నదానిపై ఆసక్తి నెలకొంది. గతంలో శాసనసభను అవమానపరిచే రీతిలో వైసీపీ వ్యవహరించిందంటూ అప్పట్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. ఇటువంటి తరుణంలో ఈ పార్టీలకు చెందిన నాయకులు ఎలా వ్యవహరిస్తారన్నదానిపైన సర్వత్ర ఆసక్తి నెలకొంది. వైసిపి మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. అదే సమయంలో జగన్ మోహన్ రెడ్డిపై ఈ పార్టీలకు చెందిన నాయకులు వ్యవహరించే తీరుపైన సర్వత్ర ఆసక్తి నెలకొంది. 

ప్రజావాణి వినిపించాలని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ 

అసెంబ్లీ సమావేశాలు నేపథ్యంలో సామాన్యుడు గొంతుకుగా ఉండాలని జనసేన పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలతో పాటు వారి ఆకాంక్షలను చట్టసభల్లో వినిపించేలా పార్టీ సభ్యులు చర్చల్లో పాల్గొనాలని దిశ నిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. సభా సంప్రదాయాలను, మర్యాదను కాపాడుతూ హుందాగా వ్యవహరిద్దామని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. మాట్లాడే భాష, వాడే పదాల విషయంలో సభ్యులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

కట్టుదిట్టమైన భద్రత 

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సభ్యులంతా ఉదయం 9:30 గంటలకు సభకు హాజరు కానున్నారు. ఎటువంటి ఆందోళనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఇప్పటికే స్పీకర్ అయ్యన్నపాత్రుడు డిజిపితోపాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్