ఏపీ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను విడుదల చేసింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రూ.2.94 లక్షల కోట్ల బడ్జెట్ ను అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ కు అంకెలకు మించిన ప్రాధాన్యం ఉందని వెల్లడించారు. గత ప్రభుత్వ విధానాలతో కుదేలైన ఆర్థిక రంగం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ.. రాష్ట్రాన్ని గాడిన పెట్టేలా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
బడ్జెట్ ప్రవేశ పెడుతున్న మంత్రి పయ్యావుల కేశవ్
ఏపీ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను విడుదల చేసింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రూ.2.94 లక్షల కోట్ల బడ్జెట్ ను అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ కు అంకెలకు మించిన ప్రాధాన్యం ఉందని వెల్లడించారు. గత ప్రభుత్వ విధానాలతో కుదేలైన ఆర్థిక రంగం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ.. రాష్ట్రాన్ని గాడిన పెట్టేలా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులన్ని స్తంభించిపోయాయని, ముఖ్య పథకాలకు చెల్లింపులు జరగలేదని ఆరోపించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మానం చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన మంత్రి.. సంక్రాంతి నాటికి గుంతలు లేని రహదారుల ఆంధ్ర తమ లక్ష్యమని స్పష్టం చేశారు. బడ్జెట్లో భాగంగా వివిధ శాఖలకు నిధులను కేటాయించారు. ఈ సభలో కీలక బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
శాఖల వారీగా నిధులు కేటాయింపు ఇలా..
ఆయా శాఖలకు ప్రభుత్వం కేటాయించిన నిధులు వివరాలను పరిశీలిస్తే.. మొత్తంగా ఏపీ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను రూ.2.94 లక్షల కోట్లతో ప్రవేశపెట్టింది. రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.35 లక్షల కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు, రెవిన్యూ లోటు రూ.34,743 కోట్లు, ద్రవ్యలోటు రూ.68,743, జీఎస్డీపిలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం, పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.16,705 కోట్లు, గృహ నిర్మాణం రూ.4012 కోట్లు, పురపాలక పట్టణ అభివృద్ధి కి రూ.11,490 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.16,739 కోట్లు, ఆరోగ్యానికి రూ.18,421, ఉన్నత విద్యకు రూ.2,326 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.18,497 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.7,557, బీసీ సంక్షేమానికి రూ.39,007 కోట్లు, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి రూ.4,376 కోట్లు, వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.11,855 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి రూ.4,285, స్కిల్ డెవలప్మెంట్ కు రూ.1215 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ.29,909 కోట్లు, ఇంధన శాఖకు రూ.8,207 కోట్లను బడ్జెట్ లో కేటాయించారు.