టి20 వరల్డ్ కప్ లో భారత్ మరో విజయం.. అమెరికాపై గెలుపు

టి20 వరల్డ్ కప్ లో భారత్ వరుసగా విజయాలు నమోదు చేస్తోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ భారత జట్టు విజయం సాధించింది. తాజాగా అమెరికాతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా సూపర్ 8కి భారత జట్టు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది.

Shivam Dube played the winning shot

విన్నింగ్ షాట్ ఆడిన శివం దూబె


టి20 వరల్డ్ కప్ లో భారత్ వరుసగా విజయాలు నమోదు చేస్తోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ భారత జట్టు విజయం సాధించింది. తాజాగా అమెరికాతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా సూపర్ 8కి భారత జట్టు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. అమెరికా బ్యాటర్లలో నితీష్ కుమార్ (27), స్టీవెన్ టెలర్ (24), కోరే అండర్సన్ (15) జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. లక్ష్య చేదనలో భారత్ 18.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసి విజయం సాధించింది. భారత జట్టు ఆటగాళ్లలో సూర్య కుమార్ యాదవ్ (50 నాటౌట్), శివం ధూబే (31) నాటౌట్ గా నిలిచి విజయాన్ని అందించారు. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్ (18) రాణించారు. అమెరికా బౌలర్లలో సౌరబ్ నేత్ర వల్కర్ రెండు వికెట్లు పడగొట్టాడు.  

తడబడి ఛేదించిన భారత్..

స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ భారత జట్టు కొంత వరకు తడబడింది. నేత్ర వల్కర్ దెబ్బకు పది పరుగులకే ఓపెనర్లు కోహ్లీ (0), రోహిత్ శర్మ(3) వికెట్లను కోల్పోయిన టీమిండియా ఇబ్బందుల్లో పడినట్టు కనిపించింది. ఆ తర్వాత వచ్చిన పంత్, సూర్య కుమార్ యాదవ్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి జట్టును విజయం తీరాల వైపు నడిపిస్తున్న క్రమంలో ఐదో ఓవర్ వేసిన సౌరబ్ బౌలింగ్ లో సూర్య సిక్స్ బాదగా, ఆ తర్వాతి ఓవర్ లో పంత్ సిక్స్ సాధించాడు. దీంతో పవర్ ప్లేలో భారత్ 33/2తో మెరుగ్గా కనిపించింది. అయితే దూకుడుగా ఆడుతున్న పంత్ ను అలీ బౌల్డ్ చేయడంతో మూడో వికెట్ కు 29 బరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో పేలవ ఫామ్ లో ఉన్న ధూబే క్రీజులోకి రావడంతో మద్య ఒవర్లలో స్కోరు వేగం మందగించింది. మరోవైపు సూర్య కుమార్ యాదవ్ కూడా ఆచితూచి ఆడడంతో పది ఓవర్లకు భారత్ 47/3 స్కోర్ చేసింది. కాగా, 22 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద సూర్య ఇచ్చిన క్యాచ్  నేత్రా వల్కర్ చేజార్చడంతో బతికిపోయాడు. మరోవైపు దూబే సిక్స్ తో గేర్ మార్చడంతో లక్ష్యం చివరి 30 బంతుల్లో 35 పరుగులుగా మారింది. ఓవర్ కు ఓవర్ కు మధ్య వన్ మినిట్ నిబంధనను అమెరికా జట్టు మూడోసారి ఉల్లంఘించడంతో ఐదు పరుగులు పెనాల్టీ విధించారు. దీంతో 16వ ఓవర్లో మొత్తం 11 పరుగులు లభించాయి. ఆ తర్వాత ఓవర్ లో సూర్య కుమార్ యాదవ్ 15 పరుగులు పిండుకోవడంతో టార్గెట్ 18 బంతుల్లో 9 రన్స్ కు వచ్చింది. సూర్య సింగిల్ తో అర్థ శతకం పూర్తి చేసుకోగా, దూబే మరో పది బంతులు మిగిలి ఉండగానే మ్యాచును ముగించాడు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్