ఏపీకి మరో వందే భారత్ రైలు.. బెంగళూరుకు వెళ్లే రూటు ఇదే

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లలో ఏపీకి తగిన ప్రాధాన్యం లభిస్తోంది. ఇప్పటికే అనేక రైళ్లను కేటాయించిన కేంద్ర రైల్వే శాఖ తాజాగా మరో వందే భారత్ రైలును కేటాయించేందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ప్రయాగనే కుల నుంచి వందే భారత్ రైలుకు మంచి ఆదరణ లభిస్తుండడంతో మరిన్ని రైళ్లను కేంద్రం కేటాయిస్తోంది. ఈ క్రమంలోనే వందే భారత్ రైలుతో మరిన్ని మార్గాల్లో ప్రారంభానికి డిమాండ్ పెరుగుతోంది. అందులో భాగంగానే విజయవాడ నుంచి గుంటూరు మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ రైలు ఏర్పాటు పైన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

Vande Bharat train

వందే భారత్ రైలు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లలో ఏపీకి తగిన ప్రాధాన్యం లభిస్తోంది. ఇప్పటికే అనేక రైళ్లను కేటాయించిన కేంద్ర రైల్వే శాఖ తాజాగా మరో వందే భారత్ రైలును కేటాయించేందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. వందే భారత్ రైలుకు మంచి ఆదరణ లభిస్తుండడంతో మరిన్ని రైళ్లను కేంద్రం కేటాయిస్తోంది. ఈ క్రమంలోనే వందే భారత్ రైలుతో మరిన్ని మార్గాల్లో ప్రారంభానికి డిమాండ్ పెరుగుతోంది. అందులో భాగంగానే విజయవాడ నుంచి గుంటూరు మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ రైలు ఏర్పాటు పైన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి రూట్ పైన ఒక నిర్ణయానికి రైల్వే శాఖ అధికారులు వచ్చినట్లు చెబుతున్నారు. త్వరలోనే ఈ రైలు ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాల నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు సంఖ్య అధికంగా ఉంటుంది. సాధారణంగా ప్రయాణికులు గుంటూరు, విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లాలంటే ప్రయాణపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులకు చెప్పేందుకు నేరుగా విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లేలా వందే భారత్ రైలును రైల్వే శాఖ ఏపీకి కేటాయించనుంది. ప్రస్తుతం విశాఖ - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - తిరుపతి, విశాఖ - ఒరిస్సా వంటి ప్రాంతాలకు వందేభారత్ రైళ్లు ఏపీలో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బెంగళూరుకు విజయవాడకు మధ్య ఒక వందే భారత్ రైలు నిర్వహించడం ద్వారా ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించవచ్చని భావించిన కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు మరో వందే భారత్ రైలు మంజూరు చేస్తుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న కాచిగూడ - యశ్వంతపూర్ వందే భారత్ కు ఆక్యుపెన్స్ రేషియో పెరుగుతుంది.

ఈ మేరకు టిడిపి లోక్సభ పార్టీ నేత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రైల్వే శాఖ మంత్రితో ఈ లైన్ లో వందేభారత్ తిరిగేలా చర్యలు తీసుకోవాలంటూ చర్చించారు. రూటు వివరాలు, ప్రయాణికుల అవసరాలు, డిమాండ్ పైన వివరంగా నివేదిక ఇచ్చిన ఎంపీ.. తాజాగా దీనిపై పార్లమెంట్లోనూ ప్రస్తావించారు. గుంటూరు నుంచి బెంగళూరుకు ప్రస్తుతం రైల్వే ప్రయాణం ఆశించిన స్థాయిలో లేదని, ప్రయాణికుల ఇబ్బందులు నేపథ్యంలో వందే భారత్ కేటాయించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ అధికారులు.. ఈ రూట్లో వందే భారత్ అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనపైన రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించి కేటాయిస్తామని పేర్కొన్నారు. బెంగళూరుకు వెళ్ళనున్న వందే భారతకు సంబంధించిన ఏ మార్గంలో నడపాలనే దానిపైన ప్రాథమికంగా అధికారులు నివేదికను సిద్ధం చేశారు. గుంటూరు నుంచి పల్నాడు ప్రాంతం మీదుగా నంద్యాల, డోన్, గుంతకల్లు, అనంతపురం, హిందూపురం, యలహంకలో స్టాపులు ఉండేలా ప్రతిపాదించారు. దీనిపైన త్వరలోనే రైల్వే శాఖ అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మార్గంలో కొత్తగా వందే భారత్ నడిపేందుకు సాంకేతిక అంశాలపైన నివేదిక కోరినట్లు సమాచారం. వీటిని పరిశీలించిన తరువాత ఈ నెలాఖరులోగా వందే భారత్ కొత్త రైలు సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్