టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటి వరకు అనేక అవార్డులు రివార్డులు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో ప్రతిష్టాత్మక పురస్కారాన్ని దక్కించుకోనున్నారు. హౌస్ ఆఫ్ కామన్స్ - యూకే పార్లమెంట్లో గౌరవ సత్కారం చిరంజీవికి జరగనుంది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాలు ద్వారా కళారంగానికి, సమాజానికి చేస్తున్న సేవలకుగాను యూకేకు చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవెందు మిశ్రా చిరంజీవిని సన్మానించనున్నారు. ఈనెల 19వ తేదీన జరగనున్న ఈ కార్యక్రమానికి సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మాన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు హాజరు కానున్నారు.
మెగాస్టార్ చిరంజీవి
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటి వరకు అనేక అవార్డులు రివార్డులు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో ప్రతిష్టాత్మక పురస్కారాన్ని దక్కించుకోనున్నారు. హౌస్ ఆఫ్ కామన్స్ - యూకే పార్లమెంట్లో గౌరవ సత్కారం చిరంజీవికి జరగనుంది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాలు ద్వారా కళారంగానికి, సమాజానికి చేస్తున్న సేవలకుగాను యూకేకు చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవెందు మిశ్రా చిరంజీవిని సన్మానించనున్నారు. ఈనెల 19వ తేదీన జరగనున్న ఈ కార్యక్రమానికి సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మాన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు హాజరు కానున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని దక్కించుకుంటున్న తొలి తెలుగు నటుడుగా చిరంజీవి నిలవనన్నారు. ఇదే వేదికపై బ్రిడ్జి ఇండియా సంస్థ.. సినిమా, ప్రజాసేవ, దాతృత్యానికి సంబంధించి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం జీవిత సాఫల్య పురస్కారం ప్రధానం చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి కి సదర సంస్థలు సమాచారాన్ని అందించాయి. బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యునైటెడ్ కింగ్డమ్ లో ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీన్ రూపొందించడానికి ప్రధానంగా పనిచేస్తుంది. వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు, వార తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో అటువంటి గొప్ప వ్యక్తులను సత్కరిస్తూ ఉంటుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును తొలిసారిగా అందించబోతోంది.
దీనినే చిరంజీవి అందుకొని ఉండడం మరో విశేషం. ఈ సంస్థ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ అవార్డును చిరంజీవికి అందించాలని నిర్ణయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలిపితే రాయిగా ఇది నిలుస్తుందని పలువురు పేర్కొంటున్నారు. యూకేకి చెందిన పార్లమెంట్ సభ్యులు, బ్రిడ్జ్ ఇండియా వంటి ప్రఖ్యాత సంస్థ అంతర్జాతీయ వేదికపై చిరంజీవిని సన్మానించడం, ఆయనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం అనేది ప్రత్యేకమైన సందర్భంగా పలువురు పేర్కొంటున్నారు. చిరంజీవి ఇప్పటికే అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. దేశ విదేశాల్లోని అనేక సంస్థలు ఆయా సంస్థలు అందించే ప్రతిష్టాత్మకమైన అవార్డులను చిరంజీవికి అందించాయి. 2024లో భారత ప్రభుత్వం నుంచి రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభీషణును చిరంజీవి అందుకున్నారు. గడిచిన ఏడాది డాన్సర్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డులు స్థానం సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అలాగే ఏఎన్నార్ శతజయంతి సందర్భంగా అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2024లో చిరంజీవికి ప్రతిష్టాత్మక ఏఎన్ఆర్ జాతి అవార్డును కూడా ప్రధానం చేసింది. వీటితోపాటు దేశంలోనే వివిధ రంగాలకు చెందిన అనేక సంస్థలు మెగాస్టార్ చిరంజీవికి తమ ప్రతిష్టాత్మకమైన అవార్డులను ప్రధానం చేసి ఆయనను గౌరవించాయి. తాజాగా చిరంజీవిని మరో అంతర్జాతీయ స్థాయి పురస్కారం వరించడం పట్ల సినీ రంగానికి చెందిన ప్రముఖులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.