వలసదారులతో భారత్ లో ల్యాండ్ అయిన మరో విమానం.. ఈసారి ఎందరోచ్చారంటే.!

అమెరికాలో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న భారతీయ వలసదారులపై అమెరికా వేటు వేస్తోంది. ఇప్పటికే వందలాది మందిని ప్రత్యేక విమానాల్లో భారత్కు తరలించిన అమెరికా.. తాజాగా పనామా బహిష్కరించిన మరికొంతమంది భారతీయులను ఇండియాకు తీసుకువచ్చింది. లాటిన్ అమెరికా దేశం అయిన పనామా నుంచి 12 మంది భారతదేశానికి తిరిగి వచ్చారు. బహిష్కరించబడిన వారిలో న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగినట్లు అధికారులు వెల్లడించారు. పనామా నుంచి బహిష్కరణ తరువాత తిరిగి వస్తున్న భారతీయుల మొదటి బ్యాచ్ ఇది. కొద్ది రోజుల కిందట అమెరికా పనామాకు బహిష్కరించిన 299 మంది వలసదారులలో ఈ 12 మంది భారతీయులు ఉన్నట్లు భావిస్తున్నారు.

Migrants coming on the plane

విమానంలో వస్తున్న వలసదారులు

అమెరికాలో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న భారతీయ వలసదారులపై అమెరికా వేటు వేస్తోంది. ఇప్పటికే వందలాది మందిని ప్రత్యేక విమానాల్లో భారత్కు తరలించిన అమెరికా.. తాజాగా పనామా బహిష్కరించిన మరికొంతమంది భారతీయులను ఇండియాకు తీసుకువచ్చింది. లాటిన్ అమెరికా దేశం అయిన పనామా నుంచి 12 మంది భారతదేశానికి తిరిగి వచ్చారు. బహిష్కరించబడిన వారిలో న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగినట్లు అధికారులు వెల్లడించారు. పనామా నుంచి బహిష్కరణ తరువాత తిరిగి వస్తున్న భారతీయుల మొదటి బ్యాచ్ ఇది. కొద్ది రోజుల కిందట అమెరికా పనామాకు బహిష్కరించిన 299 మంది వలసదారులలో ఈ 12 మంది భారతీయులు ఉన్నట్లు భావిస్తున్నారు. అంతకుముందు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఫిబ్రవరి 5, 15, 16 తేదీల్లో మూడు బ్యాచుల భారతీయ వలసదారులను అమెరికా నుంచి బహిష్కరించారు. వీరిలో అమెరికా బహిష్కరించిన దాదాపు 332 మంది భారతీయ పౌరులు ఉన్నారు. ఇందులో అమెరికా నుంచి పనామాకు పంపించబడిన 12 మంది భారతీయ పౌరులతో కూడిన విమానం తాజాగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయానికి చేరింది.

అమెరికా గడ్డపైకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న దాదాపు 2009 మంది వలసదారులు కాని వారిని పనామా నుంచి వెనక్కి పంపిన తరువాత అక్కడ నుంచి తిరిగి పంపించబడుతున్న మొదటి భారతీయుల బ్యాచ్ ఇది. బహిష్కరించబడిన వలసదారులను స్వదేశానికి రప్పించేందుకు పనామా, కోస్టారికా అమెరికాతో కలిసి పని చేస్తున్నాయి. ఈ ప్రయత్నంలో భాగంగా అమెరికా వివిధ ఆసియా దేశాల నుండి వచ్చిన పత్రాలు లేని వలసదారులను తిరిగి స్వదేశానికి పంపిస్తోంది. ఈ క్రమంలోనే 12 మంది భారతీయ పౌరులు టర్కీస్ ఎయిర్ లైన్స్ విమానంలో ఇస్తాంబుల్ మీదుగా ఢిల్లీ చేరుకున్నారు. వీరులో నలుగురు పంజాబ్ నుంచి, ఐదుగురు హర్యానా నుంచి, ముగ్గురు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు. పంజాబ్ లోని వివిధ జిల్లాలకు చెందిన నలుగురిని విమానంలో అమృత్ సర్ కు పంపించారు. ఇప్పుడు పనామాలో ఉన్న 2009 మందిలో ఎంతమంది భారతీయులు ఉన్నారు తెలియదు. పనామా బహిష్కృతులకు వారధి దేశంగా మారుతోందని అధ్యక్షుడు జోస్ రౌల్ మూలనో అంగీకరించిన తర్వాత శరణార్థులు గత వారం మూడు విమానాల్లో పనామాకు చేరుకున్నారు. పనామాలు బహిష్కరించబడిన వారు భారతీయ పౌరుల కాదా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు విజయవస్యంగా మంత్రిత్వ శాఖ పేర్కొంది. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఈ భారతీయ పౌరులను స్వదేశానికి తిరిగి రప్పించేందుకు ఏర్పాటు చేస్తామని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాత భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్