ప్రపంచ వ్యాప్తంగా అనేక వైరస్లు కొత్తగా వ్యాప్తి చెందుతున్నాయి. నిత్యం ఏదో ఒక వైరస్ వ్యాప్తి చెందుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కొత్త వైరస్లకు కేంద్రంగా చైనా ఉంటోంది. అయితే ఇండియాలో కూడా కొన్ని రకాల వైరస్ లు కొత్తగా వ్యాప్తి చెందుతున్నాయి. తాజాగా కలకత్తాకు చెందిన ఒక మహిళలో సరికొత్త వైరస్ లక్షణాలు ఇప్పుడు బయటపడడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. కలకత్తాలో నివాసం ఉంటున్న 45 వేల మహిళలకు హ్యూమన్ కరోనా వైరస్ HKU1 ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఈ మహిళ గడిచిన 15 రోజులుగా తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె దక్షిణ కలకత్తాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి స్థిరంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రపంచ వ్యాప్తంగా అనేక వైరస్లు కొత్తగా వ్యాప్తి చెందుతున్నాయి. నిత్యం ఏదో ఒక వైరస్ వ్యాప్తి చెందుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కొత్త వైరస్లకు కేంద్రంగా చైనా ఉంటోంది. అయితే ఇండియాలో కూడా కొన్ని రకాల వైరస్ లు కొత్తగా వ్యాప్తి చెందుతున్నాయి. తాజాగా కలకత్తాకు చెందిన ఒక మహిళలో సరికొత్త వైరస్ లక్షణాలు ఇప్పుడు బయటపడడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. కలకత్తాలో నివాసం ఉంటున్న 45 వేల మహిళలకు హ్యూమన్ కరోనా వైరస్ HKU1 ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఈ మహిళ గడిచిన 15 రోజులుగా తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె దక్షిణ కలకత్తాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి స్థిరంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆమెకు సోకిన వైరస్ రోమన్ కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. సదరు మహిళలను ఐసోలేషన్ లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ వైరస్ బారిన పడిన వారిలో తేలికపాటి శ్వాస కోస వ్యాధులతో ముడిపడి ఉంటుంది. ఇది మహమ్మారిగా వ్యాప్తి చెందే అవకాశం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. హ్యూమన్ కరోనా వైరస్ అనేది కరోనా వైరస్ లోని బీటా కరోనా వైరస్ హాంకానెన్స్ చెందినది. ఈ వైరస్ బారిన పడిన వారికి ప్రత్యేక చికిత్స, వ్యాక్సిన్ అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలను బట్టి వైద్య సేవలు అందిస్తే సరిపోతుంది.
ఇవీ లక్షణాలు..
కొత్తగా వ్యాప్తి చెందుతున్న వైరస్ బారిన పడిన వారిలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా జలుబుతో సహా తేలుకు పార్టీ నుండి మితమైన శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయి. ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, జ్వరం, దగ్గు, తీవ్రమైన సందర్భాల్లో ఇది నిమోనియా లేదా బ్రాంకైటీస్ కూడా కారణం అవుతుంది. ఈ వయసు ఎక్కువగా కార్డియో ఫల్మనరి వ్యాధి ఉన్నవారికి, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వారికి, శిశువులు, వృద్ధులకు వ్యాప్తి చెందే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండడం, అనారోగ్యం భరిన పడినప్పుడు ఇంట్లోనే ఉండడం, తగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు, ముక్కు కడుక్కోవడం ద్వారా వ్యాప్తిని నిరోధించేందుకు అవకాశం ఉంది. ఈ లక్షణాలను బట్టి అప్రమత్తమై వైద్యులు వద్దకు వెళ్లడం ద్వారా పరీక్షలు నిర్వహించి వైరస్ ను నిర్ధారిస్తారు. ఈ వైరస్ పట్ల ఆందోళన అవసరం లేదని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే కరోనా వైరస్ తరహాలోనే లక్షణాలు ఉండటంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతుంది.