చైనా.. అత్యాధునిక సాంకేతిక రంగాల్లో శరవేగంగా పరుగులు పెడుతున్న దేశమే కాదు.. ప్రపంచానికి సరికొత్త వ్యాధులను, వైరస్లను వ్యాప్తి చెందించే కేంద్రంగా కూడా ఉంటుంది. కొన్నాళ్ల కిందట ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ఇక్కడి ప్రారంభమై ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందింది. కరోనా వైరస్ తరహాలోనే మరో వైరస్ ఇప్పుడు చైనాలో వెలుగు చూసింది. కరోనాకు కారణమయ్యే వైరస్ మాదిరిగానే జంతువుల నుంచి మానవుడికి వ్యాపించే ప్రమాదం కలిగి ఉన్న కొత్త వైరస్ ను చైనా పరిశోధకులు గుర్తించారు.
కరోనా వైరస్
చైనా.. అత్యాధునిక సాంకేతిక రంగాల్లో శరవేగంగా పరుగులు పెడుతున్న దేశమే కాదు.. ప్రపంచానికి సరికొత్త వ్యాధులను, వైరస్లను వ్యాప్తి చెందించే కేంద్రంగా కూడా ఉంటుంది. కొన్నాళ్ల కిందట ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ఇక్కడి ప్రారంభమై ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందింది. కరోనా వైరస్ తరహాలోనే మరో వైరస్ ఇప్పుడు చైనాలో వెలుగు చూసింది. కరోనాకు కారణమయ్యే వైరస్ మాదిరిగానే జంతువుల నుంచి మానవుడికి వ్యాపించే ప్రమాదం కలిగి ఉన్న కొత్త వైరస్ ను చైనా పరిశోధకులు గుర్తించారు. గబ్బిలాలపై విస్తృత పరిశోధనలు చేసిన కారణంగా బ్యాట్ ఉమెన్ గా పేరు తెచ్చుకున్న ప్రముఖ వైరాలజిస్ట్ షీ జంగ్లీ, గ్యాంగ్జావ్ అకాడమీ ఆఫ్ సైన్స్, వూహన్ యూనివర్సిటీ అండ్ వూహన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధకులు కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. గతంలో వూహాన్ పరిశోధన కేంద్రం నుంచే కరోనాకు కారణమయ్యే వైరస్ లీక్ అయిందని ఆరోపణలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా హాంగ్కాంగ్ లోని జపసీన్ పీపీ స్ట్రైల్ రకం గబ్బిలాల్లో 'HKU5 కరోనా వైరస్' అనే కొత్త రకాన్ని గుర్తించారు. ఈ వైర స్ మెర్బికో వైరస్ ఉప జాతి నుంచి వచ్చింది. ప్రాణాంతకమైన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్) కు కారణమయ్యే వైరస్ కూడా ఈ ఉపజాతికి చెందినదే.
ఈ వైరస్ మానవ యాంజియో టెన్షన్ కన్వర్టింగ్ ఎంజైమ్ (ACE2) తో బంధం ఏర్పరచుకుంటుంది. సరిగ్గా ఇలాగే కోవిడ్ -19 కు కారణమయ్యే sars -cov -2 వైరస్ కూడా మానవ కణాలకు సోకుతుంది. తాజాగా గుర్తించిన వైరస్ గబ్బిలాల ACE2, వివిధ క్షీరదాల ACE2 ఆర్తో లాగులను కూడా ఉపయోగించుకుంటుందని పీర్ రివ్యూడ్ జర్నల్ సెల్ లో ప్రచురించిన ఒక సెర్చ్ పేపర్ వెల్లడించింది. గబ్బిలాల నమూనాల నుంచి వైరస్ వేరు చేసినప్పుడు అది మానవ కణాలకు అలాగే సూక్ష్మీకరించబడిన శ్వాసకోసా లేదా పేగు అవయవాలను పోలి ఉండే కృత్రిమంగా పెరిగిన కణాలకు సోకుతుందని పరిశోధకులు గుర్తించారు. HKU5 -cov-2 మానవులలో ACE2 గ్రాహకాలకు మాత్రమే కాకుండా అనేక ఇతర జాతుల కణాల్లో కూడా నివసిస్తాయి. ఇవన్నీ ఇంటర్మీడియట్ హోస్టులుగా పనిచేసి మానవులకు వ్యాపింపజేసే అవకాశం ఉంది. వైరస్ పై మరింత పర్యవేక్షణ అవసరమని, దాని సామర్థ్యం కరోనా వైరస్ కంటే తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు చెప్పారు. అయినప్పటికీ దీనివల్ల ఏర్పడే ప్రమాద అవకాశాలు తక్కువ చేయవద్దని పరిశోధకులు తమ పరిశోధనలో స్పష్టం చేశారు.