వాట్సప్ లో మరో కీలక ఫీచర్.. అందుబాటులోకి రానున్న లైక్ ఆప్షన్

వినియోగదారుల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతోంది. విభిన్నమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాట్సాప్ లో మరో కీలక ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో మాత్రమే లైక్ ఆప్షన్ ఉంది. ఇకపై వాట్సాప్ స్టేటస్ లకు లైక్ ఆప్షన్ అందుబాటులోకి రానుంది.

WhatsApp

 వాట్సాప్ 

వినియోగదారుల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతోంది. విభిన్నమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాట్సాప్ లో మరో కీలక ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో మాత్రమే లైక్ ఆప్షన్ ఉంది. ఇకపై వాట్సాప్ స్టేటస్ లకు లైక్ ఆప్షన్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు దిగ్గజ మెసేజింగ్ యాప్ వాట్సప్ ప్రకటన చేసింది. తన మాతృ సంస్థ మెటాకు చెందిన మెటా ఏఐ వాయిస్ తో వాట్సాప్ ను అనుసంధానం నుంచి వినియోగదారులు రియల్ టైమ్ వాయిస్ సంభాషణలో పాల్గొనేలా వీలు కల్పించనున్నట్లు తెలిపింది. మొదటి ఫీచర్ను ప్రస్తుత పరిమిత సంఖ్యలో 2.24.17.21 డేటా వెర్షన్ వాట్సప్ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించింది. వీరు స్టేటస్లను నేరుగా లైక్ చేసేలా స్క్రీన్ దిగువన హార్ట్ ఎమోజి ఉంటుందని పేర్కొంది. దీన్ని క్లిక్ చేస్తే స్టేటస్ లైక్ అవుతుందని, తమ స్టేటస్ ను ఎవరెవరు లైక్ చేశారనే దాన్ని వినియోగదారులు వ్యూవ్స్ ఆప్షన్ లో చూసుకోవచ్చని వివరించింది. రియల్ టైమ్ వాయిస్ సంభాషణల విషయంలో మెటాతో కలిసి పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఫీచర్ వినియోగదారులకు మరింత మేలు చేయనుంది. దీనివలన వినియోగదారులు వాట్సాప్ మరింత ఎక్కువ వినియోగించే అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. కొద్దిరోజుల్లోనే అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేస్తూ వాట్సాప్ ను మరింత చేరువ చేస్తున్నట్లు ప్రకటించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్