తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో కీలకంగా మారిన మెట్రో రైలును విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఈ మెట్రోను తెలంగాణలో భవిష్యత్తు సిటీగా ఆవిర్భవిస్తుందని భావిస్తున్న ముచ్చర్లకు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయో అనే దానిపై అధ్యయనం ప్రారంభించింది.
మెట్రో రైలు
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో కీలకంగా మారిన మెట్రో రైలును విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఈ మెట్రోను తెలంగాణలో భవిష్యత్తు సిటీగా ఆవిర్భవిస్తుందని భావిస్తున్న ముచ్చర్లకు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయో అనే దానిపై అధ్యయనం ప్రారంభించింది. మెట్రో రెండో దశ విస్తరణ ప్రక్రియ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. ఈ విస్తరణను ముచ్చర్ల వరకు పొడిగిస్తే ఎలా ఉంటుందన్న దానిపై ప్రభుత్వం ప్రస్తుతం ఆలోచన చేస్తోంది. ఈ మేరకు విస్తరణ ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. శంషాబాద్ వరకు మెట్రోను విస్తరించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇప్పుడు అది ముచ్చర్ల వరకు పొడిగించాలని ప్లాన్ చేస్తున్నారు. ముచ్చర్ల వరకు మెట్రో విస్తరిస్తే జరిగే పరిణామాలు, ఫీజుబులిటీ, అలైన్మెంట్, రూట్, భూసేకరణ ఇలా ప్రతి అంశంపై అధికారులు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. అన్నింటినీ పరిశీలించిన తర్వాత రెండో దశ విస్తరణలో భాగంగా పూర్తి ప్రాజెక్టు రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. మెట్రో రైల్ ముచ్చర్ల వరకు విస్తరిస్తే చాలా వరకు ఉపయోగం ఉంటుందన్న భావనను ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఇక్కడ సిటీని అభివృద్ధి చేయాలన్న ప్రణాళికలను సిద్ధం చేసింది. దీనికి మెట్రో విస్తరణ మరింత దోహదం చేస్తుందని చెబుతున్నారు.
ఇప్పటి వరకు 78.5 కిలో మీటర్ల మేర మెట్రో రైలు విస్తరించాలని ప్రభుత్వం భావించింది. ఇందులో ముచ్చర్ల చేరితే మాత్రం అంచనా వ్యయం కొన్ని కిలో మీటర్లు పెరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సుమారు 10 కోట్ల వరకు ఖర్చు పెరగవచ్చు అని ప్రభుత్వం భావిస్తోంది. శంషాబాద్ నుంచి ముచ్చర్లకు మెట్రో నడపాలంటే 35 కిలోమీటర్లు అదనంగా ట్రాక్ వేయాల్సి ఉంటుంది. శంషాబాద్ నుంచి కాకుండా నగరంలోని ఇతర మెట్రో మార్గాల నుంచి కూడా మెట్రో రైలు ముచ్చర్లకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముచ్చర్లలో ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై ప్రభుత్వం భారీ గల ప్రణాళికల సిద్ధం చేస్తోంది. ఇక్కడ దాదాపు 20 వేల ఎకరాలను సేకరించింది. దాన్ని వివిధ జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తోంది. ఐటీ హబ్, స్పోర్ట్స్ మైదానాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, పర్యాటకం, వినోదం అన్నింటికీ ఇక్కడ స్థానం ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో ముచ్చర్ల కీలకమైన సిటీగా ఆవిర్భవించనున్న నేపథ్యంలో మెట్రోను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు ఇప్పటికే అధికారులకు కీలక ఆదేశాలు చేశారు అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అనంతరం అక్కడ నుంచి వచ్చిన తరువాత మెట్రోకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఖర్చు ఎక్కువైనప్పటికీ భవిష్యత్తులో మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పనకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముచ్చర్ల వరకు మెట్రోను పొడిగించే విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.