డీఎస్సీ అభ్యర్థులకు మరో శుభవార్త.. 421 పోస్టులు అదనంగా భర్తీకి ఆదేశాలు

ఏపీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. స్పోర్ట్స్ కోట విషయంలో కీలక పంథాను ప్రభుత్వం అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 20వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ విడుదల సమయంలో స్పోర్ట్స్ కోటా కింద పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పలేదు. దీంతో ఎంతో మంది క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని పలువురు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. స్పోర్ట్స్ కోటకు కొన్ని పోస్టులు కేటాయిస్తూ ప్రకటనను తాజాగా జారీ చేశారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. స్పోర్ట్స్ కోట విషయంలో కీలక పంథాను ప్రభుత్వం అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 20వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ విడుదల సమయంలో స్పోర్ట్స్ కోటా కింద పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పలేదు. దీంతో ఎంతో మంది క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని పలువురు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. స్పోర్ట్స్ కోటకు కొన్ని పోస్టులు కేటాయిస్తూ ప్రకటనను తాజాగా జారీ చేశారు. ఇప్పటికే విడుదల చేసిన డీఎస్సీతో సంబంధం లేకుండా స్పోర్ట్స్ కోట ఉద్యోగాలు భర్తీ కోసం మరో నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేసేందుకు అనుగుణంగా 421 పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ను ప్రభుత్వం ఇచ్చింది. అర్హత కలిగిన క్రీడాకారులకు నేరుగా మూడు శాతం రిజర్వేషన్ కల్పించింది. ఈ పోస్టుల భర్తీకి ఎటువంటి పరీక్షలు ఉండవని ప్రభుత్వం ప్రకటించింది. అర్హులకు నేరుగా సర్టిఫికెట్స్ పరిశీలించి మెరిట్ ఆధారంగా ఉద్యోగాలను ఇవ్వనున్నారు. ఈ 421 పోస్టుల్లో ప్రభుత్వం జడ్పీ, ఎంపీ పాఠశాలల్లోనే 333 ఉద్యోగాల ఖాళీగా చూపించారు. మిగిలిన వేరువేరు పాఠశాలలో భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ మే 15 వరకు ఉంది. జూలైలో ఆయా పోస్టులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ ఉండనుంది. ఈ దఫా నోటిఫికేషన్లో అనేక మార్పులను ప్రభుత్వం చేసింది. ఏ యాజమాన్యం కింద ఉన్న పాఠశాలల్లో ఉద్యోగం కావాలో ముందుగానే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికెట్లు కూడా అప్లోడ్ చేయమని ముందుగానే వెల్లడించారు. దీంతో అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు.

చదువును కీలకమైన సమయంలో పక్కన పెట్టి సర్టిఫికెట్ల కోసం కార్యాలయాలు, కాలేజీలు, యూనివర్సిటీలు చుట్టూ తిరగడం ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల మంది అభ్యర్థులు ప్రభుత్వానికి తమ గోడు చెప్పుకున్నారు. సమయం వృధా అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఈ సమస్యను విన్న ప్రభుత్వం సర్టిఫికెట్లు అప్లోడ్ ఆప్షన్ గా పెట్టింది. అంటే సర్టిఫికెట్లు ఉన్నవాళ్లు మాత్రమే అప్లోడ్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలన్నది ఖచ్చితమైన రూల్ కాదని వెసులుబాటు కల్పించింది. తరువాత ఆయన అప్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో అభ్యర్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే డీఎస్సీలో అదనంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి పోస్టులు పెరగడంతో స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన అభ్యర్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ లో తమను పరిగణలోకి తీసుకోకపోవడం పట్ల వారంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లడంతో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. స్పోర్ట్స్ కోటకు సంబంధించిన పోస్టులను జత చేసి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ లో మేలు చేకూరే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్టు అయింది. రాష్ట్రవ్యాప్తంగా వందలాది సంఖ్యలో ఉన్న స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన అభ్యర్థులకు ఈ నిర్ణయం వల్ల మేలు కలుగుతుందని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్