ప్రపంచాన్ని మరో మహమ్మారి భయాందోళనకు గురి చేస్తోంది. మొన్నటి వరకు కరోనా సృష్టించిన విలయంతో అల్లాడిన ప్రపంచాన్ని ప్రస్తుతం మంకీ ఫాక్స్ వైరస్ భయాందోళనకు గురిచేస్తోంది. ప్రపంచంలోనే అనేక దేశాల్లో మంకీ ఫాక్స్ జోరుగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్త తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మంకీ ఫాక్స్
ప్రపంచాన్ని మరో మహమ్మారి భయాందోళనకు గురి చేస్తోంది. మొన్నటి వరకు కరోనా సృష్టించిన విలయంతో అల్లాడిన ప్రపంచాన్ని ప్రస్తుతం మంకీ ఫాక్స్ వైరస్ భయాందోళనకు గురిచేస్తోంది. ప్రపంచంలోనే అనేక దేశాల్లో మంకీ ఫాక్స్ జోరుగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్త తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మంకీ బాక్స్ ప్రస్తుతం ఆఫ్రికా ఖండాన్ని దాటి వేరే ఖండాల దేశాల్లోనూ వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండడంతో 2022 తర్వాత తొలిసారిగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఆఫ్రికాలో ఈ ఏడు రోజుల్లో 15,600 కేసులు నమోదయ్యాయి. 537 మంది ఎంపాక్స్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా స్వీడన్, పాకిస్తాన్ లకు ఈ వైరస్ పాకింది. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడి ప్రపంచ దేశాలకు సవాలుగా మారబోతోంది.
1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్ ను కనుగొన్నారు. అందుకే ఈ వైరస్ కు మంకీ ఫాక్స్ పేరు పెట్టారు. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్ కు తరలించిన కోతుల్లో కొత్తరకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికిని కనిపెట్టారు. 1970లో కాంబో దేశంలో తొమ్మిది ఏళ్ల బాలుడికి ఈ వైరస్ సోకడంతో తొలిసారిగా మనుషుల్లో ఈ వైరస్ ను గుర్తించారు. మనుషులు, చిట్టెలుకలకు వైరస్ వాకడంతో మంకీ ఫాక్స్ కు బదులు ఎంఫాక్స్ అనే పొట్టి పేరును ఖరారు చేశారు. ఆర్థో ఫాక్స్ వైరస్ రకానికి చెందిన ఎంఫాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులు వస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న మసూచి వ్యాధికి కారణమైన వైరస్ ఎంఫాక్స్ ఒకే జాతికి చెందినవే. గోవులకు సోకే గోమచూచి, వసీనియా వంటి వ్యాధులను కలిగించే వైరస్ కూడా ఈ రకానిదే.
వైరస్ ఎలా సోకుతుంది అంటే
ఈ వైరస్ అప్పటికే వైరస్ సోకిన మనిషి లేదా జంతువులను తాకిన, వారితో దగ్గరగా గడిపిన వ్యాప్తి చెందుతుంది. కుక్క లేదా ఇతర పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా, తాకిన వాటి లాలాజలం, రక్తం ఇతర స్రావాలు అంటుకున్న వైరస్ వ్యాప్తి చెందుతుంది. చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినప్పుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం.. ఇలా వైరస్ కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచి వైరస్ సోకుతుంది. ఎక్కువసేపు ముఖాన్ని ముఖంతో తాకిన, ముద్దు పెట్టుకున్న సోకవచ్చు. రోగి వాడిన వస్తువులు, దుస్తులు ముట్టుకున్న, వాడినా వైరస్ సోకే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ బారిన పడిన వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. చర్మంపై దద్దుర్లతోపాటు భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి వస్తాయి. ఒళ్లంతా నీరసంగా ఉంటుంది. గొంతు ఎండిపోతుంది. మధ్య స్థాయిలో పొక్కులు పైకి తేలి ఇబ్బందులు కలిగిస్తాయి. మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి వన్యప్రాణుల నుంచి సోకుతుంది. 90% కేసుల్లో ముఖంపైన, 75% కేసుల్లో అరచేతిలో, పాదాలు మీద, 30% కేసుల్లో జననాంగాల మీద పొక్కులు వస్తాయి. నీటి బొడిపెలుగా చిన్నగా మొదలై పెద్దవై తర్వాత సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. అత్యల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంఫాక్స్ బారినపడిన వారికి నిర్దిష్టమైన చికిత్స విధానం లేదు. లక్షణాలను బట్టి వైద్య సేవలు అందిస్తున్నారు.