తెలంగాణలో మరో ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి

తెలంగాణ - చతిస్ ఘడ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ములుగు జిల్లా చల్పాక దగ్గర అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఉదయం గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు గ్రేహౌండ్స్ బలగాలు నిర్ధారించాయి.

Troops of combing greyhounds

కూంబింగ్ చేస్తున్న గ్రేహౌండ్స్ బలగాలు 

తెలంగాణ - చతిస్ ఘడ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ములుగు జిల్లా చల్పాక దగ్గర అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఉదయం గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు గ్రేహౌండ్స్ బలగాలు నిర్ధారించాయి. పది రోజుల కిందటే మావోయిస్టులో ఇన్ ఫార్మర్లు గా భావించి ఇద్దరిని చంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఎన్కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనా స్థలంలో రెండు ఏకే 47 రైఫిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ఆదివాసీలను ఇన్ ఫార్మర్ల నెపంతో చంపేసిన దానికి ప్రతికారంగానే ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. వారం రోజులు తిరగకముందే ఏడుగురు మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మృతి చెందారు. ఆదివాసీల హత్య అనంతరం అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు గడిచిన వారం రోజుల నుంచి భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే చలపాక సమీప అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరువైపులా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మృతి చెందిన వారిలో ఇల్లందు పార్టీ సెక్రటరీ కుర్సం మంగు, ఏటూరు నాగారం కార్యదర్శి ఈగోలపు మల్లయ్య, ఏసీఎం ముస్సాకి దేవల్, ఏ సీఎం ముస్సాకీ జమున, పార్టీ సభ్యులు జై సింగ్, కిషోర్, కామేష్ ఉన్నారు. 

డిసెంబర్ రెండో తేదీ నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టు పార్టీ పి ఎల్ జి వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టులు కీలక భేటీ నిర్వహించారు. ఈ భేటీపై పక్కా సమాచారంతో పోలీసులు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. 14 ఏళ్ల తర్వాత వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో అతిపెద్ద ఎన్కౌంటర్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ భేటీకి సంబంధించిన సమాచారం రెండు రోజుల కిందటే పోలీసులకు అందింది. ఈ నేపథ్యంలోనే పకడ్బందీగా వారిని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. మావోయిస్టులు కూడా పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టుల మృతిచెందారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్