చత్తీష్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరగ్గా, యాంటీ నక్సలైట్ ఆపరేషన్‌లో భాగంగా భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవులను భద్రతా బలగాలు జల్లెడ పట్టాయి. సుక్మా జిల్లా బండార్ పదర్ కొండల్లో ఒక దగ్గర మావోయిస్టులు నక్కి ఉన్నట్టు గుర్తించి వారిని చుట్టుముట్టారు. మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు దిగడంతో భధ్రతా బలగాలు ఎదులు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు.
కూంబింగ్ చేస్తున్న భద్రతా దళాలు
చత్తీష్‌ఘడ్ దండకారణ్యంలో వరుసగా ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలోనే మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరగా, పలువురు మావోయిస్టులు మృతి చెందారు. తాజాగా చత్తీష్‌ఘడ్ దండకారణ్యంలో శుక్రవారం మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు కాల్పుల్లో పది మంది మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టులకు చత్తీష్‌ఘడ్ దండకారణ్యాన్ని కంచుకోటగా చెబుతారు. గడిచిన కొన్నాళ్లుగా మావోయిస్టులు ఈ దండకారణ్యాన్ని కేంద్రంగా చేసుకుని దేశంలోని అనేక ప్రాంతాలకు తమ కార్యకలాపాలను విస్తరిస్తూ మనగడను సాగిస్తున్నారు. ఇటువంటి కీలక స్థానంపైన కేంద్రం దృష్టి సారించింది. ప్రత్యేకంగా కూంబింగ్ చేయిస్తూ మావోయిస్టులు ఏరివేత ప్రక్రియను చేపడుతోంది. ఈ క్రమంలోనే గడిచిన కొన్నాళ్లుగా అనేకసార్లు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది కీలక మావోయిస్టులు మృతి చెందడంతో వారి ఉనికికే సవాల్‌గా ప్రస్తుత కూంబింగ్ మారుతోంది.
తాజాగా చత్తీష్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరగ్గా, యాంటీ నక్సలైట్ ఆపరేషన్‌లో భాగంగా భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవులను భద్రతా బలగాలు జల్లెడ పట్టాయి. సుక్మా జిల్లా బండార్ పదర్ కొండల్లో ఒక దగ్గర మావోయిస్టులు నక్కి ఉన్నట్టు గుర్తించి వారిని చుట్టుముట్టారు. మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు దిగడంతో భధ్రతా బలగాలు ఎదులు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటన స్థలం నుంచి ఏకే 47, ఇన్సాస్, ఎస్‌ఎల్‌ఆర్‌లు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ఆటోమేటిక్ ఆయుధాలతోపాటు విప్లవ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు లభ్యమయ్యాయి. భద్రతా బలగాలు, మావోయిస్టులు మధ్య ఏడాదికాలంగా భీకర పోరు సాగుతోంది. ఫలితంగా వందలాది మంది మావోయిస్టులు హతమవుతున్నారు. వారం రోజులు క్రితం అబూజ్‌మడ్ అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఏడాది ఏప్రిలక్ష కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతి చెందగా, అదే నెలలో బీజ్‌పూర్ జిల్లా పోర్చెలి అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మృతి చెందారు. మావోయిస్టులను ఏరివేయడమే లక్ష్యంగా కేంద్ర హోంశాఖ భారీ ఎత్తున కూంబింగ్ చేయిస్తుండడంతో, వరుసగా పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందడంతో వారికి ఉనికి ప్రమాదంగా మారింది.