బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు ఆ సంస్థ మరో సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ.127 నెలవారీ ఖర్చుతో ఏడాదిపాటు అపరమిత కాలింగ్, డేటాను పొందే అవకాశాన్ని కల్పించింది. ఈ ప్లాన్‌లో ఓటీటీ సబ్ స్ర్కిప్సన్ లేనప్పటికీ డబ్బుకు తగిన ప్లాన్‌గా ఇది నిలుస్తుందని బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా ప్రైవేటు టెలీకాం కంపెనీలు తమ రీచార్జ్ ప్లాన్స్‌ను భారీగా పెంచుకుంటూ వెళుతున్నాయి. ప్రైవేటు టెలీకాం కంపెనీలకు భిన్నంగా బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ముందుకు వెళుతోంది. అతి తక్కువ ధరల్లో ప్లాన్స్‌ను అందబాటులోకి తెస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
ప్రతీకాత్మక చిత్రం
బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు ఆ సంస్థ మరో సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ.127 నెలవారీ ఖర్చుతో ఏడాదిపాటు అపరమిత కాలింగ్, డేటాను పొందే అవకాశాన్ని కల్పించింది. ఈ ప్లాన్‌లో ఓటీటీ సబ్ స్ర్కిప్సన్ లేనప్పటికీ డబ్బుకు తగిన ప్లాన్‌గా ఇది నిలుస్తుందని బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా ప్రైవేటు టెలీకాం కంపెనీలు తమ రీచార్జ్ ప్లాన్స్‌ను భారీగా పెంచుకుంటూ వెళుతున్నాయి. ప్రైవేటు టెలీకాం కంపెనీలకు భిన్నంగా బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ముందుకు వెళుతోంది. అతి తక్కువ ధరల్లో ప్లాన్స్‌ను అందబాటులోకి తెస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీంతో ప్రతి నెల దేశ వ్యాప్తంగా వివిధ ప్రైవేటు టెలీకాం కంపెనీలు నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ వైపు వినియోగదారులు పోర్టు అవుతున్నారు. దీంతో వారిని నిలబెట్టుకునేందుకు అనుగుణంగా భిన్నమైన ప్లాన్స్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ తెస్తోంది. నిజానికి ప్రభుత్వ టెలీకాం కంపెనీ బాగా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్‌లకు పెట్టింది పేరుగా నిలిచింది. బీఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్ల కోసం రెండు అద్భుతమైన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్స్‌లను తాజాగా ప్రవేశపెట్టింది. ఇవి డేటా, అపరిమిత కాలింగ్‌తోపాటు రోజువారీ ఎస్‌ఎంఎస్ సౌకర్యాలను కల్పిస్తోంది. చాలా తక్కువ ధరకు ఈ సేవలను అందిస్తోంది.
ఆయా ఆఫర్లకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. ముందుగా బీఎస్‌ఎన్‌ఎల్ రూ.1515 ప్లాన్ గురించి చూద్దాం. ఇది ఏడాదిపాటు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు ప్రతిరోజూ 2జీబీ హై స్పీడ్ డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌లో అపరమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లును కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో ఎటువంటి ఓటీటీ సబ్ స్ర్కిప్షన్ లేకపోయినప్పటికీ వినియోగదారులు మొత్తం ఏడాదిలో 720 జీబీ డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌ను 12 నెలలుగా లెక్కిస్తే నెలకు ఖర్చు కేవలం రూ.126.25 మాత్రమే. దాదాపు నెలకు రూ.127 రూపాయలు చెల్లించడం ద్వారా ఏడాదిపాటు రీచార్జ్ టెన్షన్ లేకుండా ఉండవచ్చు. ఇక, రెండో వార్షిక ప్లాన్ విషయానికి వస్తే దీని ధర రూ.1499. ఇందులో 365 రోజులు అంటే దాదాపు ఏడాది కంటే 11 రోజులు తక్కువ. ఈ ప్లాన్‌లో మొత్తం 24 జీబీ డేటాను అందిస్తోంది. ఇది మొత్తం చెల్లుబాటు అవుతుంది. ఒకేసారి డేటాను పొందుతారు. దీనితోపాటు ఈ ప్లాన్ అపరమిత కాలింగ్‌ను కూడా అందిస్తోంది. ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.