రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే ఉద్దేశంతో దావత్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక ఒప్పందాన్ని చేసుకున్నారు. ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందాన్ని చేసుకుంది. ఇన్ఫోసిస్ సంస్థకు ప్రస్తుతం పోచారంలో ఒక క్యాంపస్ ఉంది. ఈ క్యాంపస్ ను మరింత విస్తరించడం ద్వారా మరో 17 వేల మందికి ఉపాధి కల్పించేందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వంతో ఇన్ఫోసిస్ సంస్థ తాజాగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఈ క్యాంపస్ లో మరో 17 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
ఇన్ఫోసిస్ ప్రతినిధులతో శ్రీధర్ బాబు
రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే ఉద్దేశంతో దావత్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక ఒప్పందాన్ని చేసుకున్నారు. ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందాన్ని చేసుకుంది. ఇన్ఫోసిస్ సంస్థకు ప్రస్తుతం పోచారంలో ఒక క్యాంపస్ ఉంది. ఈ క్యాంపస్ ను మరింత విస్తరించడం ద్వారా మరో 17 వేల మందికి ఉపాధి కల్పించేందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వంతో ఇన్ఫోసిస్ సంస్థ తాజాగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఈ క్యాంపస్ లో మరో 17 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వరల్డ్ ఎకానమిక్ ఫోరం వేదికగా ఇన్ఫోసిస్ సిఎఫ్ఓ జయేష్ సంఘ్ రాజ్కా, తెలంగాణ ఐటి శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా విస్తరణ కోసం రూ.750 కోట్ల రూపాయల పెట్టుబడిని ఇన్ఫోసిస్ సంస్థ దశల వారీగా పెట్టనుంది. ఐటీ భవనాల నిర్మాణంతోపాటు ఉద్యోగాలను ఇన్ఫోసిస్ సంస్థ కల్పించనుంది. మొదటి దశలో పదివేల మందికి వసతి కల్పించేలా భవనాలను నిర్మించాలని భావిస్తున్నారు. రానున్న రెండు మూడేళ్లలో ఈ భవన నిర్మాణాల ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం పోచారం లోని ఇన్ఫోసిస్ క్యాంపస్ లో 35 వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. తాజా ఒప్పందం ద్వారా మరో 17 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇన్ఫోసిస్ సంస్థకు దేశంలో ఉన్న కీలక క్యాంపస్ ల్లో ఇది ఒకటి. ఒకరకంగా చెప్పాలంటే అతిపెద్ద క్యాంపస్ ఇదే. దీనిని మరింత విస్తరించడం ద్వారా అతిపెద్ద క్యాంపస్ గా దీనిని మార్చుకునే ఆలోచనలో ఇన్ఫోసిస్ సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఒప్పందంతో ఐటీ రంగంలో మరో ముందడుగు తెలంగాణ ప్రభుత్వం వేసినట్టు అయింది. తెలంగాణలో ఐటీ రంగ విస్తరణకు ఇది మరింత దోహదం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఐటీ గమ్యస్థానంగా తెలంగాణను మార్చడంలో ఈ ఒప్పందం కీలకం కానుందని ఒప్పందం సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సాంకేతిక రంగం అభివృద్ధికి, అవసరమైన సహకారాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న చురుకైన విధానంలో భాగంగానే ఈ ఒప్పందం జరిగినట్లు ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు, వ్యూహాత్మక పెట్టుబడును పెంపొందించుకునేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో తమ భాగస్వామ్యం ముందుకెళ్లేలా చేయడంలో, తమ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసుకోవడంలో ఈ ఒప్పందం కీలకంగా మారుతుందని ఇన్ఫోసిస్ సిఎఫ్ఓ జయేష్ సంఘ్ రాజ్క ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ విస్తరణతో ఇన్ఫోసిస్ కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగానికి మరింత ఉత్తేజితాన్ని తీసుకువచ్చేందుకు ఉపకరిస్తుందని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ ఒప్పందం ద్వారా ఐటీ రంగానికి ఉత్తేజితాన్ని తీసుకువచ్చినట్టు అయిందని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.