పాములు పగబడతాయని సినిమాల్లో చూస్తుంటాం. పగబట్టిన పాము అతని ప్రాణాలు తీసే అంతవరకు ఆగదు. ఇందుకోసం పాము పడే పాట్లు, ఆ పాము నుంచి రక్షణ పొందేందుకు సదర వ్యక్తి పడే ఇబ్బందులను అనేక సినిమాల్లో చూసే ఉంటాం. అయితే సినిమా తరహాలో నిజజీవితంలోనూ ఒక వ్యక్తి పై పాములు పగబడ్డాయి. కొద్ది రోజులు వ్యవధిలోనే ఏడుసార్లు కాటు వేశాయి.
పాము
పాములు పగబడతాయని సినిమాల్లో చూస్తుంటాం. పగబట్టిన పాము అతని ప్రాణాలు తీసే అంతవరకు ఆగదు. ఇందుకోసం పాము పడే పాట్లు, ఆ పాము నుంచి రక్షణ పొందేందుకు సదర వ్యక్తి పడే ఇబ్బందులను అనేక సినిమాల్లో చూసే ఉంటాం. అయితే సినిమా తరహాలో నిజజీవితంలోనూ ఒక వ్యక్తి పై పాములు పగబడ్డాయి. కొద్ది రోజులు వ్యవధిలోనే ఏడుసార్లు కాటు వేశాయి. మరో రెండు సార్లు కాటు వేస్తాయని పాము కలలోకి వచ్చి చెప్పినట్లు సదరు యువకుడు చెబుతున్నాడు. దీనికి సంబంధించిన వివరాలు.. ఉత్తర్ ప్రదేశ్ లోని ఫతేపూర్ లో ఒక యువకుడిని పాములు ఏడుసార్లు కాటు వేశాయి. వీటిలో ఆరుసార్లు శనివారం రోజే కరవడం గమనార్హం. ఇదంతా 40 రోజుల వ్యవధిలో జరగడం గమనార్హం. పాము కరిచిన తర్వాత ప్రతిసారి కోలుకుంటున్న అతడిని మళ్లీ పాము కరుస్తోంది.
ఇటీవల తన కలలోకి పాము వచ్చిందని, మరో రెండు సార్లు కూడా కాటేస్తానని చెప్పినట్టు యువకుడు కుటుంబ సభ్యులకు వెల్లడించాడు. అయితే ఈసారి కరిచిన తర్వాత మాత్రం ప్రాణాలు తక్కువనే విషయాన్ని పాము తనకు చెప్పిందని ఆ యువకుడు కుటుంబ సభ్యులకు తెలియజేయడం గమనార్హం. సౌరా గ్రామానికి చెందిన అతని పేరు వికాస్ దుబే (24). ఒకరోజు పడుకునే లేచి మంచం దిగుతుండగానే జూన్ రెండున తొలిసారి దూబెను పాము కరిచింది. ఈ నెల 6వ తేదీ నాటికి ఆరుసార్లు పాములు కరిచాయి. తాజాగా మరోసారి బంధువు ఇంటి వద్ద కాటుకు గురయ్యారు. ప్రతిసారి ఘటనకు మూడు నాలుగు గంటల ముందు తనకు పాము కరవబోతుందని సంకేతాలు వస్తున్నట్లు దూబే చెప్పాడు. పదేపదే ఆసుపత్రి పాలవడంతో తన ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారిందని అధికారులకు మొరపెట్టుకున్నాడు. కాగా ఇన్నిసార్లు పాము కరవడంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. వాస్తవాలు తేల్చాలని ముగ్గురు వైద్యులతో కమిటీ కూడా వేశారు.