రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫలితాల కోసం ఎదురు చూసినట్టుగా ఎంతో మంది ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కోసం ఎదురు చూశారు. శనివారం సాయంత్రం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని కోట్లాది మంది ప్రజలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వీక్షించేందుకు ఆసక్తిగా టీవీలు, సెల్‌ఫోన్లు ముందు కూర్చున్నారు.
ఎగ్జిట్ పోల్
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫలితాల కోసం ఎదురు చూసినట్టుగా ఎంతో మంది ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కోసం ఎదురు చూశారు. శనివారం సాయంత్రం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని కోట్లాది మంది ప్రజలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వీక్షించేందుకు ఆసక్తిగా టీవీలు, సెల్‌ఫోన్లు ముందు కూర్చున్నారు. అనేక సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ పలితాలను వెల్లడించాయి. కొన్ని సంస్థలు అధికార వైసీపీకి అనుకూలంగా ఫలితాలు ఇవ్వగా, మరికొన్ని సంస్థలు కూటమి విజయ బావుటా ఎగురవేస్తాయని ఇచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు ముందు వరకు ఎవరు గెలుస్తారన్న దానిపై అనేక అనుమానాలు, సందేహాలతో ఉన్న ప్రజలకు.. ఈ ఫలితాలు ఆ తరువాత ఆ సమస్య మరింత పెరిగినట్టు అయింది తప్పా స్పష్టత రాకుండా పోయింది. ఎందుకంటే ఇక్కడ కూడా పార్టీలు వారీగానే ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించిన సంస్థలు కూడా విడిపోయాయి. కూటమికి అనుకూలంగా కొన్ని సంస్థలు ఫలితాలను వెల్లడించగా, వైసీపీకి అండగా మరికొన్ని సంస్థలు నిలిచాయి. దీంతో ఎవరి సర్వే ఫలితాలను నమ్మాలో తెలియని అయోమయ స్థితిలో సాధారణ ప్రజలు ఉండిపోవాల్సి వచ్చింది.
తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో పార్ధదాస్ సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వైసీపీకి 110-120, కూటమి 55-65, స్మార్ట్‌పోల్ వైసీపీకి 80-81, కూటమి 93 ప్లస్ 8 ఆర్ మైనస్, జన్మత్ పోల్స్‌లో వైసీపీకి 95-103, కూటమికి 67-75, చాణిక్య స్ర్టాటజీస్ వైసీపీకి 39-49, కూటమి 1140125, వ్రాప్ వైసీపీకి 158, కూటమికి 14-17, ఆరా మస్తాన్ వైసీపీకి 94-104, కూటమికి 71-81, పీపుల్స్ కూటమికి 111-135, వైసీపీకి 45-60, ప్రిజమ్ కూటమికి 110, వైసీపీకి 60 సీట్లు వస్తాయని వెల్లడించాయి. దీంతో ఏ సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నమ్మాలో తెలియని అయోమయ స్థితిలో ప్రజలు పడిపోయారు. ఎగ్జిట్ పోల్స్ కంటే ఎగ్జాట్ ఫలితాలు వెలువడే జూన్ నాలుగో తేదీ వరకు నిరీక్షించడం మంచిదన్న భావనలోకి చాలా మంది వెళ్లిపోయారు.