టిడిపి పగ్గాలు లోకేష్ కు అప్పగించాలి : బుద్ధా వెంకన్న

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తర్వాత రాష్ట్ర టిడిపి అధ్యక్ష పదవిని నారా లోకేష్ కు ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు అమరావతిలో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే లోకేష్ ను పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించాలని కోరారు.

బుద్ధా వెంకన్న
బుద్ధా వెంకన్న




సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తర్వాత రాష్ట్ర టిడిపి అధ్యక్ష పదవిని నారా లోకేష్ కు ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు అమరావతిలో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే లోకేష్ ను పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించాలని కోరారు. లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే మరో 30 ఏళ్లపాటు పార్టీకి తిరుగు ఉండదని వెంకన్న పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 130 స్థానాలు గెలుచుకుంటారని ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఈ నెల 13వ తేదీన జరిగిన పోలింగ్ లో ఓటర్లు కూటమి అభ్యర్థులకు పట్టం కట్టారని, సిఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారని జోష్యం చెప్పారు. లోకేష్ 226 రోజుల్లో 3,132 కిలో మీటర్లు పార్టీ కోసం పాదయాత్ర చేశారని, లక్షలాది మంది ప్రజల అభిమానాన్ని కూడగట్టుకున్నారన్నారు. ప్రస్తుత టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు బాగానే పనిచేస్తున్నారని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన మంత్రి కాబోతున్నారన్నారని, కాబట్టి పార్టీ బాధ్యతలను పూర్తిగా లోకేష్ కు అప్పగించాలని డిమాండ్ చేసిన వెంకన్న.. సీఎం గా చంద్రబాబు, పార్టీ అధ్యక్షుడుగా లోకేష్ ఒకే రోజు బాధ్యతలు స్వీకరిస్తే బాగుంటుందన్నారు. చంద్రబాబు ఆత్మకథను తప్పకుండా రాస్తానని, అందులో తనకు ఒక పేజీ ఉంటుందని వెంకన్న స్పష్టం చేశారు. చంద్రబాబు రాముడు అయితే.. తాను హనుమంతుడినని, తనకు సీటు ఇవ్వకున్నా చంద్రబాబు కోసం పని చేశానన్నారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలకు మొదటి బాధితుడుని తానేనని, ఆయనను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. నోటి దూల ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలందరూ విదేశాలకు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్