పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు అవకాశాలపై రఘురామరాజు కీలక వ్యాఖ్యలు

జగన్ వచ్చినా పిఠాపురంలో పవన్ కల్యాణ్ 65 వేల ఓట్ల మెజారిటీ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏపీలో అధికారం చేపడుతుందని రఘురామరాజు జోస్యం చెప్పారు.

pawan kalyan pitapuram
పవన్‌తో రఘురామరాజు Photo: Facebook

ఈవార్తలు, పిఠాపురం: అరాచక, దోపిడీదారుల నుంచి ఆంధప్రదేశ్‌ను కాపాడుకొందామని, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా చేద్దామని నర్సాపురం ఎంపీ, టీడీపీ నేత రఘురామ రాజు అన్నారు. కాకినాడ జిల్లా చేబ్రోలులో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో రఘురామ రాజు సమావేశమయ్యారు. శాలువా కప్పి, పూల బొకే అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్, నాగబాబుతో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. ఎక్కడి నుంచి పోటీ చేసినా పవన్ తన కోసం ప్రచారం చేస్తారని వెల్లడించారు. జగన్ వచ్చినా పిఠాపురంలో పవన్ కల్యాణ్ 65 వేల ఓట్ల మెజారిటీ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏపీలో అధికారం చేపడుతుందని జోస్యం చెప్పారు.



సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్