ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం దిశగా సాగుతోంది. ఇప్పటికే టీడీపీ 130 స్థానాల్లో లీడ్ సాధించగా, బీజేపీ 7, జనసేన 20 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అధికార వైసీపీ దారుణంగా ఓటమి దిశగా సాగుతోంది. ఆ పార్టీ కేవలం 18 సీట్లలో ముందంజలో ఉంది.
చంద్రబాబునాయుడు
అమరావతి, ఏపీ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం దిశగా సాగుతోంది. ఇప్పటికే టీడీపీ 130 స్థానాల్లో లీడ్ సాధించగా, బీజేపీ 7, జనసేన 20 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అధికార వైసీపీ దారుణంగా ఓటమి దిశగా సాగుతోంది. ఆ పార్టీ కేవలం 18 సీట్లలో ముందంజలో ఉంది. ఇక.. అధికారం దిశగా సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు సాగుతున్నట్లు సమాచారం. ఆయన ఈ నెల 9వ తేదీన అమరావతిలో ప్రమాణం చేస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు, తెలుగు మహిళలు, తమ్ముళ్లు సంబురాల్లో మునిగిపోయారు. ఆ పార్టీ కార్యాలయంలో సందడి సందడి నెలకొంది. అటు.. వైసీపీ కార్యాలయం బోసిపోయింది. కార్యకర్తలు కూడా ఎవ్వరూ కనిపించడం లేదు.