చంద్రబాబు SLBC సమావేశం.. 5.4 లక్షల కోట్లతో రుణ ప్రణాళిక

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన సచివాలయంలో మంగళవారం 227వ స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ SLBC సమావేశం జరిగింది.

slbc chandrababu

స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ సభ్యులతో ఏపీ సీఎం చంద్రబాబు

అమరావతి, ఈవార్తలు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన సచివాలయంలో మంగళవారం 227వ స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ SLBC సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5,40,000 కోట్లతో ఎల్ఎల్‌బీసీ రుణ ప్రణాళిక విడుదల చేసింది. అందులో 3.75 లక్షల కోట్ల రూపాయలను ప్రాధాన్య రంగాలకు, రూ.1.65 లక్షల కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళికను రూపొందించారు. డైరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలకు రూ.32,600 కోట్లతో రుణ ప్రణాళిక ప్రకటించారు.

ఈ సమావేశంలో 5 ప్రధాన అంశాలపై మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఏపీ ప్రభుత్వం, బ్యాంకర్లతో కలిపి సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ రంగానికి 2.64 లక్షల కోట్ల రుణాలు ఇవ్వడమే లక్ష్యం పెట్టుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, యూనియన్ బ్యాంక్ ఈడీ సంజయ్ రుద్ర, ఎస్ఎల్‌బీసీ కన్వీనర్ సీవీఎన్ భాస్కర్ రావు, ఇతర బ్యాంకు అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్