తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రానికి పునర్వైభవం రాబోతోందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం విశాఖలోని కనకమహలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలితం రేపు రాబోతోందన్న గంటా.. ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలకు రేపటి ఫలితాలతో మోక్షం లభించబోతుందన్నారు.
గంటా శ్రీనివాసరావు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రానికి పునర్వైభవం రాబోతోందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం విశాఖలోని కనకమహలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలితం రేపు రాబోతోందన్న గంటా.. ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలకు రేపటి ఫలితాలతో మోక్షం లభించబోతుందన్నారు. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ ఏకపక్షంగా కూటమిదే విజయం అని స్పష్టం చేశాయన్న గంటా.. ప్రజల్లో వైసిపి ప్రభుత్వాన్ని దించాలన్న కసి పెరిగింది అన్నారు. త్వరగా ఈ ప్రభుత్వాన్ని తరిమేయాలనే ఉద్దేశంతో ప్రజలంతా ఓట్లు వేసేందుకు వచ్చినట్లు స్పష్టంగా కనిపించిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా బస్సుల్లో, ట్రైన్లలో వేలాడుతూ ఓట్లు వేసేందుకు ప్రజలు వచ్చారని, ఈ పరిస్థితులను అనేక ప్రాంతాల్లో చూసామని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. అత్యధికంగా నమోదైన పోలింగ్ శాతం ప్రజల నాటికి సంకేతమని స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు మించి కూటమి ఘన విజయం సాధించబోతుందని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖలోని ఏడు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాన్ని క్లీన్ స్వీప్ చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. అల్లర్లు సృష్టించే వాళ్ళు ఎవరో ప్రజలకు తెలుసని, సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. భీమిలిలో, రాష్ట్రంలోనూ గెలుపు తెలుగుదేశం పార్టీదేనని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న భావన ప్రజల్లో కనిపించిందన్నారు. కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలోనే అభివృద్ధి సాధ్యపడుతుందన్న భావన ప్రజల్లో ఉందని, అందుకే మెజారిటీ ప్రజలు ఓట్లు కూటమికి అనుకూలంగా వేశారన్నారు.