విద్యా కానుక రెడీ.. ఈ నెల 12 పంపిణీకి ఏర్పాట్లు

ప్రభుత్వ స్కూల్స్‌లో చదివే విద్యార్థులకు అందించే విద్యా కానుక కిట్లను అధికారులు సిద్ధం చేశారు. వీటిని మండల స్టాక్‌ పాయింట్లకు ఇప్పటికే తరలించారు. జూన్‌ 12న స్కూళ్లు తెరిచిన తొలిరోజే వీటిని పంపిణీ చేసేందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యా కానుక కిట్‌లో బ్యాగు, బెల్ట్‌, బూట్లు, సాక్సులు, పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్‌, వర్క్‌ బుక్స్‌, డిక్షనరీ, యూనిఫామ్‌, క్లాత్‌ ఉంటాయి.

education gift kit

విద్యా కానుక కిట్



ప్రభుత్వ స్కూల్స్‌లో చదివే విద్యార్థులకు అందించే విద్యా కానుక కిట్లను అధికారులు సిద్ధం చేశారు. వీటిని మండల స్టాక్‌ పాయింట్లకు ఇప్పటికే తరలించారు. జూన్‌ 12న స్కూళ్లు తెరిచిన తొలిరోజే వీటిని పంపిణీ చేసేందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యా కానుక కిట్‌లో బ్యాగు, బెల్ట్‌, బూట్లు, సాక్సులు, పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్‌, వర్క్‌ బుక్స్‌, డిక్షనరీ, యూనిఫామ్‌, క్లాత్‌ ఉంటాయి. ఈ ఏడాదికి 38 లక్షల మంది విద్యార్థులకు ఈ కిట్లు అందించనున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థులకు ఈ విద్యా కానుక కిట్లు అందిస్తున్నారు. నాడు-నేడు ప్రోగ్రామ్‌లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించింది. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్యను పెంచే ఉద్ధేశంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా కానుక కిట్లు అందిస్తోంది. ఇదిలా, ఉంటే వైసీపీ ప్రభుత్వం ఈ కిట్లపై సీఎం జగన్‌ ఫొటోలు ముద్రించడంతో ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు వాటిని తొలగించింది. ఎటువంటి బొమ్మలు, లోగోలు లేకుండా బ్యాగ్‌లు, కిట్‌లోని ఇతర సామాగ్రిని విద్యార్థులకు అందించనున్నారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్