ఏపీలో వైసీపీకి మరో షాక్.. పీఏసీ పదవి జనసేన సొంతం

ఆంధ్రప్రదేశ్ పీఏసీ చైర్మన్ పదవి అంశంలో ప్రతిపక్ష వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి సరైన సంఖ్యాబలం లేకపోవడంతో ఆ పదవి జనసేనను వరించింది.

janasena pac chairman
పులవర్తి ఆంజనేయులు

అమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్ పీఏసీ చైర్మన్ పదవి అంశంలో ప్రతిపక్ష వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి సరైన సంఖ్యాబలం లేకపోవడంతో ఆ పదవి జనసేనను వరించింది. పీఏసీ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుంది అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగగా.. తాజాగా దానికి తెరపడింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన పార్టీకి చెందిన పులవర్తి ఆంజనేయులు పేరును ప్రతిపాదించగా, ఆయనకే దాదాపు పదవి ఖాయమైంది. త్వరలోనే ఆయన పేరును లాంఛనంగా ప్రకటించే అవకాశం ఉంది. కాగా, పీఏసీ చైర్మన్ పదవి రావాలంటే కనీసం 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. కానీ.. వైసీపీకి అసెంబ్లీలో కేవలం 11 మంది సభ్యులే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ పదవి జనసేన సొంతమైంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్