చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడి పగ్గాలు బీసీకి..

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కింజారపు అచ్చెన్నాయుడు స్థానంలో ఆ పార్టీ గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావుకు అవకాశం కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

palla srinivas rao
పల్లా శ్రీనివాస్ రావు

విజయవాడ, ఈవార్తలు: ఏపీలో అధికారంలోకి రావటంతోనే పార్టీలో, ప్రభుత్వంలో అనేక సంస్కరణలు చేపడుతున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కింజారపు అచ్చెన్నాయుడు స్థానంలో ఆ పార్టీ గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావుకు అవకాశం కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అచ్చెన్నాయుడు మంత్రి కావటంతో, ఆయన బాధ్యతలను శ్రీనివాస్ రావుకు అప్పగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ రావు సంచలనం సృష్టించారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచారు. వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్‌పై ఏకంగా 95,235 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన బీసీ యాదవ వర్గానికి చెందిన వ్యక్తి. దీంతో ఆయనవైపే చంద్రబాబు మొగ్గు చూపినట్లు తెలిసింది. దీంతో బీసీ వర్గాల్లో టీడీపీకి ఆదరణ లభిస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

పల్లా శ్రీనివాస్ రావు ప్రొఫైల్:

- పల్లా శ్రీనివాస్ రావు తండ్రి టీడీపీలో ఉండేవారు.

- అయితే, 2009లో శ్రీనివాస్ రావు ప్రజారాజ్యం నుంచి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

- తర్వాత టీడీపీలో చేరి 2014లో గాజువాక ఎమ్మెల్యేగా గెలుపొందారు.

- 2019 ఎన్నికల్లో ఓడిపోయారు.

- సౌమ్యుడు, వివాదరహితుడిగా పేరు.

- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ఉద్యమం నిర్వహించారు.

- వైసీపీ పాలనలో పలు కేసులు ఎదుర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్