ఎగ్జిట్‌ పోల్‌తో సంబంధం లేదు.. ప్రజలపై నమ్మకం ఉంది : వైవీ సుబ్బారెడ్డి

రాష్ట్రంలోని అధికారాన్ని కైవసం చేసుకోవడంపై ఎగ్జిట్‌ పోల్‌ సంస్థలు ఇచ్చిన ఫలితాలతో సంబంధం లేదని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్రజలపై తమకు అపారమైన నమ్మకం ఉందన్న ఆయన.. సీఎం జగన్‌ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయని స్పష్టం చేశారు.

YV Subbareddy

ఎంపీ వైవీ సుబ్బారెడ్డి 


రాష్ట్రంలోని అధికారాన్ని కైవసం చేసుకోవడంపై ఎగ్జిట్‌ పోల్‌ సంస్థలు ఇచ్చిన ఫలితాలతో సంబంధం లేదని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్రజలపై తమకు అపారమైన నమ్మకం ఉందన్న ఆయన.. సీఎం జగన్‌ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తుఫాను, సునామీ ఏదీ లేదని, ప్రజలు ప్రశాంతంగా ఓట్లేశారన్న వైవీ సుబ్బారెడ్డి.. ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సీఎం జగన్‌ చేసిన మేలు పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారని, సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు మళ్లీ ఆయనకే అధికారాన్ని కట్టబెట్టబోతున్నారని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. రెండోసారి సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేస్తారన్న ఆయన.. ఇందులో ఎటువంటి సందేహమూ అవసరం లేదన్నారు. కౌంటింగ్‌కు సంబంధించి తమ పార్టీ కార్యకర్తలు, ఏజెంట్లు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలోని మెజార్టీ అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించనున్నారని ఆయన స్పష్టం చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్