సహకార సంఘాలకు నామినేటెడ్ పాలకవర్గాలు.. ఆరు నెలల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు

రాష్ట్రంలోని సహకార సంఘాలకు నామినేటెడ్ పాలక వర్గాలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో పార్టీ క్యాడర్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. కనీసం ఆరు నెలల పాటు నామినేటెడ్ పోస్టులను అనుభవించే అవకాశం దక్కుతుందన్న ఆనందాన్ని నాయకులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత కూటమి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకుంది.

Co-operative society building

సహకార సంఘ భవనం

రాష్ట్రంలోని సహకార సంఘాలకు నామినేటెడ్ పాలక వర్గాలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో పార్టీ క్యాడర్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. కనీసం ఆరు నెలల పాటు నామినేటెడ్ పోస్టులను అనుభవించే అవకాశం దక్కుతుందన్న ఆనందాన్ని నాయకులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత కూటమి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక నామినేటెడ్ పోస్టుల్లో కొనసాగుతున్న వారిని రాజీనామా చేయించిన కూటమి ప్రభుత్వం.. ఆ స్థానాల్లో తమ పార్టీకి చెందిన నాయకులకు అవకాశాలను కల్పించింది. ఇప్పటి వరకు వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను, డైరెక్టర్లను కూటమి ప్రభుత్వం నియమించింది. తాజాగా సహకార సంఘాలకు నామినేటెడ్ పాలక వర్గాలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది నాయకులకు, కార్యకర్తలకు అవకాశాలను కల్పించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధం అవుతున్నారు.

ఈ మేరకు టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు సమావేశంలో సీఎం నిర్ణయాన్ని వెల్లడించారు. ఆరు నెలలపాటు ఈ నామినేటెడ్ పాలకవర్గాలు ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది. మిత్రపక్షలకు నామినేటెడ్ పదవుల్లో 20 శాతం ఇవ్వనన్నారు. రాష్ట్రం మొత్తం మీద ఈ శాతం ప్రకారం ఇస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.  కిందిస్థాయిలో జనసేన నేతలతో సమన్వయంలో కొన్ని సమస్యలు వస్తున్నట్లు పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువచ్చారు. మిత్రపక్షాలతో  ఇటువంటి సమస్యల సర్దుబాటుకు ఇద్దరు సభ్యులతో కమిటీ వేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి చెందిన నాయకులకు నామినేటెడ్ పదవులు దక్కునున్నాయి. ఇప్పటికే ఆయా పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వందలాది సంఖ్యలో సహకార సంఘాలు ఉన్నాయి. ఒక్కో సహకార సంఘానికి ముగ్గురు సభ్యులతో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల వేలాదిమందికి నామినేటెడ్ పోస్టులు దక్కనున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటనతో ఆశావాహులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ తమ స్థాయిల్లో ఆయా స్థానాలను దక్కించుకునేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వారంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు చుట్టూ ఆయా పోస్టుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా తాజాగా వీటిని నామినేటెడ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు సిద్ధం అవుతుండడం పట్ల వారంతా తమ ప్రయత్నాలను తీవ్రతరం చేయనున్నారు. ఆరు నెలలపాటు ఈ పాలకవర్గాలు నడవనున్నాయి. ఆరు నెలలు తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్