అమెరికా వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ప్రధాన పార్టీలకు చెందిన కీలక నాయకులు విదేశాలకు వెళుతున్నారు. ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి లండన్ టూర్ కు వెళ్ళగా.. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఐదు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు వెళ్ళారు.

నారా చంద్రబాబు నాయుడు
నారా చంద్రబాబు నాయుడు



రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ప్రధాన పార్టీలకు చెందిన కీలక నాయకులు విదేశాలకు వెళుతున్నారు. ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి లండన్ టూర్ కు వెళ్ళగా.. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఐదు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు వెళ్ళారు. అమెరికాలో ఆయన పలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతంలోనూ చంద్రబాబు అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. శనివారం అర్ధరాత్రి అమెరికా బయలుదేరిన చంద్రబాబు ఐదు రోజులపాటు ఉండనున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్ కూడా అమెరికాకు వెళ్ళారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సుమారు రెండు నెలలపాటు చంద్రబాబు నాయుడు పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం తీవ్ర స్థాయిలో కృషి చేశారు. రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేశారు. ఎన్నికల ముగియడంతో చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్లారు. ఎన్నికల వేడి వాతావరణం నుంచి ఉపశమనం పొందడంతో పాటు ఆరోగ్య పరీక్షలను చేయించుకునే ఉద్దేశంతో ఈ పర్యటనకు ఆయన వెళ్లినట్లు చెబుతున్నారు. ఇది పార్టీలు చెందిన అగ్రనేతలతో పాటు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన పలువురు ముఖ్య నాయకులు కూడా ఇతర ప్రాంతాలకు పర్యటనలకు వెళ్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్