Roja vs Getup Srinu | రోజా వర్సెస్ గెటప్ శ్రీను.. రక్తి కట్టిస్తున్న ఏపీ రాజకీయాలు

జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను, ఏపీ మంత్రి రోజా సెల్వమణి మధ్య మాటలు రాజకీయాలను రంజుగా మార్చేశాయి. ఆ మధ్య గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ కలిసి జనసేన ప్రచారంలో పాల్గొన్నారు. దీనిపై మీడియా రోజాను ప్రశ్నించారు.

roja getup srinu
గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, మంత్రి రోజా

ఈవార్తలు, ఏపీ పాలిటిక్స్: ఏపీ రాజకీయాలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతున్నాయి. మరీముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను, ఏపీ మంత్రి రోజా సెల్వమణి మధ్య మాటలు రాజకీయాలను రంజుగా మార్చేశాయి. ఆ మధ్య గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ కలిసి జనసేన ప్రచారంలో పాల్గొన్నారు. దీనిపై మీడియా రోజాను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘వీళ్లతో ఎవరు మాట్లాడిస్తున్నారో తెలుసు. వీళ్లతో అలా మాట్లాడిస్తున్నవారి గురించి ఆలోచించాలి గానీ, వీళ్లను అనటం ఎందుకు? వీళ్లంతా చిన్న షోలు చేసుకుంటూ, చిన్న చిన్న పాత్రలు చేసుకొనేవాళ్లు. మీకు తెలియనిది ఏముంది? మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే సినీ ఇండస్ట్రీలో లేకుండా చేస్తారన్న భయంతో వాళ్లు ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నారు. ప్రేమతో ఎవరూ లేరు. నిజంగా ప్రేమే ఉంటే వాళ్లు మా ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌కు మద్దతు తెలిపారు. మరి ఆయనెందుకు గెలవలేదు. ప్రేమ వేరు.. భయం వేరు.. అని’ అని వెల్లడించారు.

ఈ వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. తాను హీరోగా నటిస్తున్న రాజు యాదవ్ సినిమా ట్రైలర్ విడుదల సమావేశంలో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబిచ్చాడు. ఈ సందర్భంగా రోజా వ్యాఖ్యలపై స్పందించాలని ఓ విలేకరి కోరగా.. ‘మెగా కుటుంబంతో ఎన్ని సినిమాలు చేశానో అందరికీ తెలుసు. వెంకటేశ్‌, ఎన్టీఆర్‌, నానితోనూ సినిమాలు చేశా. ఇతర హీరోల చిత్రాల్లో నాకు ఆఫర్లు రావట్లేదా? ఏ మనిషీ అందరికీ నచ్చడు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై అభిమానం ఉన్నందునే ఆ పార్టీ తరఫున ప్రచారం చేశా. ఆయనకు లక్ష మెజారిటీ వస్తుంది. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన చీఫ్‌కు ప్రజల స్పందన వస్తోంది. మమ్మల్ని చిన్నవాళ్లు అన్నవారి మాటలను చిన్నగానే తీసుకుంటాం’ అని తెలిపాడు. సుడిగాలి సుధీర్, తాను తమంతట తామే ఫోన్‌ చేసి.. ప్రచారానికి వెళ్లాం తప్ప ఎవరూ తమను రమ్మని అడగలేదని స్పష్టం చేశారు.

వెబ్ స్టోరీస్