ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విద్య, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి నారా లోకేష్ ప్రజా సమస్యలపై జోరుగా స్పందిస్తున్నారు. ఎక్కడ ఏ సమస్య ఉందని తెలిసినా వెంటనే స్పందించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఫోన్ నెంబర్ విస్తృతంగా రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రజల వద్దకు చేరింది.
మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విద్య, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి నారా లోకేష్ ప్రజా సమస్యలపై జోరుగా స్పందిస్తున్నారు. ఎక్కడ ఏ సమస్య ఉందని తెలిసినా వెంటనే స్పందించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఫోన్ నెంబర్ విస్తృతంగా రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రజల వద్దకు చేరింది. ఇదే ఇప్పుడు ఆయనకు ఇబ్బందికర అంశంగా పరిణమించింది. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చే ఉద్దేశంతో ఎంతో మంది బాధితులు ఆయనకు నేరుగా వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నారు. ప్రతిరోజు వేలాదిగా వస్తున్న వాట్సప్ మెసేజ్ లతో మంత్రి నారా లోకేష్ కు ఇబ్బంది ఎదురవుతోంది. వేలాదిగా వస్తున్న మెసేజ్ లతో వాట్సాప్ బ్లాక్ అవుతోందని మంత్రి నారా లోకేష్ నేరుగా వెల్లడించారు. ఈ ఇబ్బందుల నుంచి బయట పడేందుకు ప్రజా సమస్యలు, వినతులను ఇకపై మెయిల్ చేయాలని మంత్రి లోకేష్ ఈ మేరకు ఒక ప్రకటనలో వెల్లడించారు. తన వాట్సాప్ ఖాతా తరచూ బ్లాక్ అవుతోందని, అందుకే తన వ్యక్తిగత ఈ మెయిల్ అడ్రస్ ఇస్తున్నానని, సాయం కోసం వచ్చే ప్రజల కోసం తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని నారా లోకేష్ ఈ మేరకు పేర్కొన్నారు. పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, సమస్య, ఏ సాయం కోరుతున్నారో వంటి వివరాలను వినతుల్లో పేర్కొనాలని
మంత్రి నారా లోకేష్ ఆ ప్రకటనలో
సూచించారు. లోకేష్ ఇప్పటికే ఉండవల్లిలోని నివాసంలో ప్రతిరోజు ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. ఇకపై మెయిల్ ద్వారా కూడా ప్రజల ఇబ్బందులను తెలుసుకుని పరిష్కరించనున్నారు. లోకేష్ వాట్సప్ బిజినెస్ ఎకౌంట్ కావడంతో తెలియని ఫోన్ నెంబర్ల నుంచి పెద్ద ఎత్తున సందేశాలు వస్తుంటే తరచూ బ్లాక్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేశారు. ఏవైనా సమస్యలను తెలియజేయాలనుకుంటే hello.lokesh@ap.gov.in కు మెయిల్ చేయాలని మంత్రి నారా లోకేష్ సూచించారు.