సిట్ అధికారులకు మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం జరిగిన హింసపై సిట్ బృందం విచారణ సాగిస్తోంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ సిట్ జోరుగా విచారణ సాగిస్తోంది. మంత్రి అంబటి రాంబాబు సిట్ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు.

మంత్రి అంబటి రాంబాబు
మంత్రి అంబటి రాంబాబు


రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం జరిగిన హింసపై సిట్ బృందం విచారణ సాగిస్తోంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ సిట్ జోరుగా విచారణ సాగిస్తోంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున గొడవలు జరిగిన పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో సిట్ అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఆయా జిల్లాల్లో నమోదైన కేసులు, గొడవలకు కారణమైన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు నుంచి ఫిర్యాదులను కూడా అధికారులు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు సిట్ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగిన అల్లర్లపై పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సిందిగా మంత్రి కోరారు. ముఖ్యంగా సత్తెనపల్లి రూరల్ సీఐ రాంబాబు పాత్ర పై విచారణ చేయాల్సిందిగా ఆయన సిట్ అధికారులను కోరారు. ఎన్నికల పోలింగ్ అనంతరం కొందరు అధికారుల ఉదాసీన వైఖరి, ప్రోత్సాహంతోనే పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి అన్న భావనను అంబటి రాంబాబు వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ జరపడం ద్వారా గొడవల కారణమైన వారిని గుర్తించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి కోరారు. మంత్రి వినతపై సానుకూలంగా స్పందించిన సిట్ అధికారులు.. విచారణ సాగిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. 

ఉదాసీన వైఖరితోనే విధ్వంసం 

రాష్ట్రంలో సార్వత్రిక పోలింగ్ అనంతరం పోలీసులు ఉదాసీన వైఖరితో వ్యవహరించడం వలన పెద్ద ఎత్తున హింస చెలరేగిందని సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నప్పటికీ పోలీసులు తేలిగ్గా తీసుకోవడంతోనే ఘటనల తీవ్రత పెరిగిందన్న భావనను సిట్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. తలలు పగిలేలా గొడవలు జరిగినప్పటికీ పోలీసులు వీటిని పట్టించుకోకపోగా, గొడవలకు కారణమైన వారిపై సాధారణ సెక్షన్లు విధించడం పైన సిట్ అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాడిపత్రిలో జరిగిన రాళ్లదాడులపై సిఐ, ఎస్ఐలను సిట్ బృందం నిడదీసినట్లు చెబుతున్నారు. దాడుల తర్వాత బందోబస్తు పెంచకపోవడంపైన సిట్ అధికారులను పోలీసులను ప్రశ్నించారు.  పోలీసుల వైఫల్యం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సిట్ అధికారులు.. కొందరిపై చర్యలను తీసుకోవాల్సిందిగా సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్