చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మెగాస్టార్‌ చిరంజీవి, రజనీకాంత్‌

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టాలీవుడ్‌ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి, తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూడా హాజరుకానున్నారు.

Megastar Chiranjeevi and Rajinikanth

 చిరంజీవి, రజనీకాంత్‌

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కూటమి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానించి గవర్నర్‌కు చంద్రబాబు పేరును పంపించారు. ఈ మేరకు బుధవారం ఉదయం 11.27 గంటలకు విజయవాడలో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు అతిథులుగా ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్‌ షా ప్రమాణ స్వీకారానికి హాజరవుతుండగా, టాలీవుడ్‌ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి, తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానాలను పంపించారు. మెగాస్టార్‌ చిరంజీవి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతుండగా, ప్రత్యేక ఆహ్వానితులుగా తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హాజరవుతున్నారు. ఒకవైపు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులను ప్రమాణ స్వీకారానికి టీడీపీ నాయకులు ఆహ్వానిస్తూనే.. మరో వైపు సినీ రంగానికి చెందిన దిగ్గజాలను ఆహ్వానిస్తున్నారు. వీరితోపాటు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులు, నిర్మాతలు, దర్శకులకు కూడా ఆహ్వానాలు అందాయి. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్