సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి మరోసారి ఆయన అన్నపై నిప్పులు చెరిగారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక ప్రాంతాల్లో నిర్వహించిన సభలు, సమావేశాల్లో సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. ఎన్నికల అనంతరం కూడా అంతే స్థాయిలో సీఎం జగన్ పై నిప్పులు కక్కుతున్నారు.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి మరోసారి ఆయన అన్నపై నిప్పులు చెరిగారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక ప్రాంతాల్లో నిర్వహించిన సభలు, సమావేశాల్లో సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. ఎన్నికల అనంతరం కూడా అంతే స్థాయిలో సీఎం జగన్ పై నిప్పులు కక్కుతున్నారు. ఏలూరు జిల్లా మండవల్లిలోని ఓ పాఠశాలలో 14 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైందంటూ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఉదహరిస్తూ ఎక్స్ లో ఆమె స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పాలన రాష్ట్ర మహిళల భద్రతకు, బతుకులకు పట్టిన చీడ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా అవ్వలు అంటూ జబ్బులు చరిచి, మైకుల ముందు గొంతు చించుకొని ముసలి కన్నీరు కార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఫేక్ ప్రేమలు నటించే ముఖ్యమంత్రి గారు.. మన రాష్ట్రంలో మీ పాలనలో మహిళల భద్రతకు, బతుకులకు పట్టిన పీడ దేశమంతా చెప్పుకుంటోంది. లండన్ వీధుల్లో పొర్లుదండాల మధ్య వివరిస్తున్న మీకు. ఇక్కడి ప్రజల ఆర్తనాదాలు, ఆహాకారాలు వినపడవు. రాష్ట్రానికి అత్యున్నత ర్యాంకులు ఎందులో రావాలో అందులో రావు. మీరు, మీ మహిళా మంత్రులు, నాయకురాలు సిగ్గుతో తలవంచుకుంటారో, సిగ్గులేకుండా మిన్నకుండిపోతారో ప్రజలు గమనిస్తున్నారు' అని షర్మిల వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పై షర్మిల రెడ్డి తాజాగా వ్యక్తం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరింత వేడిని పుట్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కడప లోక్సభ స్థానం నుంచి షర్మిలారెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే. వైయస్ అవినాష్ రెడ్డి ఓటమి లక్ష్యంగా ఆమె బరిలోకి దిగారు. ఎంపీగా గెలుపుపై ఆమె ధీమాను వ్యక్తం చేస్తున్నారు.