తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు కార్యనిర్వాహక అధికారి (ఈవో)గా 1997 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి జే శ్యామలారావును నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఐఏఎస్ శ్యామలారావు
అమరావతి, ఈవార్తలు : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు కార్యనిర్వాహక అధికారి (ఈవో)గా 1997 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి జే శ్యామలారావును నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనను ట్రాన్స్‌ఫర్ చేస్తూ టీటీడీ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుత ఈవో ధర్మారెడ్డి సెలవులపై వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను ఆ పదవి నుంచి తొలగించి శ్యామలారావుకు పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే సీఎం బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. తిరుమలలో ఓం నమో వేంకటేశాయ స్మరణ తప్ప, రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెంకన్నను దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో శ్యామలారావును నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది.