పిన్నెల్లికి షాక్.. కౌంటింగ్ రోజు మాచర్లకు వెళ్ళొద్దన్న హైకోర్టు

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కు హైకోర్టు షాక్ ఇచ్చింది. పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు.. కొన్ని ఆంక్షలను కూడా ఆయనపై విధించింది. ఓట్ల లెక్కింపు రోజు మాచర్లకు వెళ్ళవద్దని హైకోర్టు ఆదేశించింది.

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి



మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కు హైకోర్టు షాక్ ఇచ్చింది. పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు.. కొన్ని ఆంక్షలను కూడా ఆయనపై విధించింది. ఓట్ల లెక్కింపు రోజు మాచర్లకు వెళ్ళవద్దని హైకోర్టు ఆదేశించింది. నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొచ్చని స్పష్టం చేసింది. వచ్చేనెల 6 వరకు లోక్సభ నియోజకవర్గ కేంద్రంలోనే ఉండాలని హైకోర్టు పిన్నెల్లికి సూచించింది. కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని, సాక్షులతో మాట్లాడే ప్రయత్నం చేయరాదని స్పష్టం చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కదలకల పై పూర్తిస్థాయి నిగా ఉంచాలని ఉన్నత న్యాయస్థానం.. ఈ మేరకు సీఈవో, పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలను జారీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో నిందితుడుగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. పోలీసులు అరెస్టు చేస్తారని ఉద్దేశంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అక్కడ నుంచే హైకోర్టుని ఆశ్రయించిన ఆయన.. ముందస్తు బెయిల్ పొంది ఉపశమనం పొందారు. అయితే మాచర్లకు వెళ్లకూడదన్న ఆంక్షలతో ఆయన అనుచరులు, అభిమానులు ఆవేదన చెందుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్