ఏపీలో జగనన్న గోరుముద్ద పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లోని చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజన పథకానికి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చింది. ఈ పథకానికి డొక్కొ సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా ప్రభుత్వం నామకరణం చేసింది.
ఏపీలో జగనన్న గోరుముద్ద పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లోని చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజన పథకానికి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చింది. ఈ పథకానికి డొక్కొ సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా ప్రభుత్వం నామకరణం చేసింది. గతంలో డొక్కొ సీతమ్మ పేరుతో కొన్ని చోట్ల అన్న కేంటీన్లు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజన పథకానికి ఈ పేరు పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా డొక్కొ సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన మెనూను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మెనూలో భాగంగా పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు ప్రభుత్వం అందించనుంది.
- సోమవారం కూరగాయల పులావ్, కోడిగుడ్డు కూర, వేరుశన, బెల్లం చిక్కీ అందించనున్నారు.
- మంగళవారం పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు, రాగిజావ ఇవ్వనున్నారు.
- బుధవారం కూరగాయల అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశన చిక్కీ ఇవ్వనున్నారు.
- గురువారం సాంబార్ బాత్, లెమన్ రైస్, టమోట పచ్చడి అందించనున్నారు.
- శుక్రవారం అన్నం, ఆకు కూర పప్పు, ఉడికించిన కోడి గుడ్డు, వేరుశనగ, బెల్లం చిక్కీ ఇవ్వనున్నారు.
- శనివారం మాత్రం ఆకుకూర అన్నం, పప్పుచారు, రాగిజావ, స్వీట్ పొంగల్‌తో కూడిన పోషకాహారాన్ని విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ మేరకు మెనూను జిల్లా విద్యాశాఖ అధికారులకు అక్కడి నుంచి ప్రాథమిక, ఉన్నత, జిల్లా పరిషత్ పాఠశాలల ప్రిన్సిపల్స్‌కు పంపించింది. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మెనూ వండి వడ్డించాల్సిందిగా ప్రభుత్వం వంట నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ఇకపై వంట నిర్వాహకులు యూనిఫామ్ కూడా ధరించాల్సిందిగా స్పష్టం చేసింది.