రాష్ట్రంలో అసలు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎన్ని ఉన్నాయి అన్నదానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించిన వివరాలను మీకు అందిస్తున్నాం. రాష్ట్రంలో 5,39,187 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల నాలుగో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అధికారంలో ఉన్న వైసిపి మరోసారి తాము పీఠాన్ని కైవసం చేసుకుంటామని చెబుతుండగా.. భారీ మెజారిటీతో అధికారాన్ని దక్కించుకుంటామని కూటమి నేతలు ధీమాగా ఉన్నారు. శనివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా రెండు వైపులా విజయావకాశాలు ఉన్నాయంటూ వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించిన చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లన్నీ దాదాపుగా కూటమికే పడతాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అసలు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎన్ని ఉన్నాయి అన్నదానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించిన వివరాలను మీకు అందిస్తున్నాం. రాష్ట్రంలో 5,39,187 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. వీటిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు 1,60,000, పోలీసులు 1,30,000, రెవెన్యూ అధికారులు 60,000, సచివాలయం ఉద్యోగులు 50,000, ఇతర శాఖల ఉద్యోగులు 44,216 ఉన్నారు. వీరంతా కలిపి 4,44,216 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు. వీరితోపాటు పోస్టల్ బ్యాలెట్/హోమ్ ఓటింగ్ వేసిన వాళ్ళు కొందరు ఉన్నారు. వీరిలో వృద్ధులు 13,755, ఎమర్జెన్సీ కార్మికులు 27,100, వికలాంగులు 12,718, సర్వీస్ ఓటర్లు 41,398 కలిపి మొత్తంగా 94,971 మంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, హోమ్ ఓటింగ్/ఇతర పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలిపి మొత్తంగా 5,39,187 మంది పోస్టల్ బ్యాలెట్ లో ఓటు హక్కు వినియోగిస్తున్నారు. వీరిలో ఎవరు ఎవరు పక్షాన నిలిచారు అన్నది ఈ నెల నాలుగో తేదీన తేలనుంది.