చంద్రగిరి, సత్తెనపల్లిలో రీపోలింగ్ వ్యాజ్యాలు కొట్టివేత

చంద్రగిరి, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలోని వివిధ పోలింగ్ బూత్ ల్లో రీపోలింగ్ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసిపి అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టి వేసింది. గురువారం వ్యాజ్యాలు విచారణకు రాగా కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించారు.

హైకోర్టు
హైకోర్టు



చంద్రగిరి, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలోని వివిధ పోలింగ్ బూత్ ల్లో రీపోలింగ్ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసిపి అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టి వేసింది. గురువారం వ్యాజ్యాలు విచారణకు రాగా కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించారు. పిటిషన్లకు విచారణ అర్హత లేదని, ఈవీఎం, వివి ప్యాట్ల స్కూటీని సమయంలో అభ్యర్థులు ఉండాలని ఎలాంటి చట్టబద్ధమైన నిబంధన లేదని పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూములు సీజ్ చేసే ముందు అభ్యర్థుల సమక్షంలో ఈవీఎం, వివి ప్యాట్లను స్కూటీని చేయాలని ఆర్వోలకు ఈసీ సూచనలు మాత్రమే ఇచ్చిందన్నారు. ఈవీఎంలు స్క్రూట్నీకి సంబంధించిన 17(ఏ) ఫామ్లను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచామని, కౌంటింగ్ రోజు మాత్రమే వాటిని బయటకు తీయగలమని స్పష్టం చేశారు. అన్ని వివరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత రీపోలింగ్ అవసరం లేదని ఈసీ నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. పిటిషనర్లకు అభ్యంతరం ఉంటే ఈసీకి పిటిషన్ దాఖలు చేసుకోవాలి తప్ప.. హైకోర్టులో రిట్ దాఖలు చేయడానికి వీలు లేదన్నారు. రాజ్యాంగంలోని అధీకరణ 329(బి) మేరకు ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని, అందుకు సంబంధించి సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని విన్నవించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం పిటిషన్లను కొట్టివేసింది. ఈవీఎం, వివి ప్యాట్ల స్కృూటీని తన సమక్షంలో నిర్వహించి ఫామ్-17(ఏ)లను రూపొందించేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నియోజకవర్గంలోని పలు బూత్ ల్లో రీపోలింగ్ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే సత్తెనపల్లి నియోజకవర్గంలోని వివిధ బూత్ ల్లో వెబ్ కెమెరా ఫుటేజీలు, తాము సమర్పించిన ఆధారాలను పరిశీలించి ఆయా పోలింగ్ బూత్ ల్లో రీపోలింగ్ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అక్కడ వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలను హైకోర్టు కొట్టి వేసింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్